Page Loader
ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఆగస్టు 31 నుంచి ప్రారంభం
ఆసియా కప్

ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఆగస్టు 31 నుంచి ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2023
06:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ షెడ్యూల్‌ను వచ్చేసింది. ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబర్ 17వరకు ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహించనున్నట్లు ఏసీసీ పేర్కొంది. మొత్తం 13 మ్యాచుల్లో నాలుగు పాకిస్తాన్‌లో, 9 మ్యాచులు శ్రీలంకలో జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరగనుంది. షెడ్యూల్ ప్రకారం 2023 ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే పాకిస్థాన్ లో పర్యటించేందుకు టీమిండియా ఒప్పుకోకపోవడంతో యూఏఈ, ఇంగ్లాండ్ లో కూడా ఈ టోర్నీ జరుగుతుందని వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు ఆసియా కప్ 2023 షెడ్యూల్ పై ఏసీసీ క్లారిటీ ఇచ్చింది.

Details

ఆరు జట్లను రెండు గ్రూపులు విభజించారు

ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘానిస్తాన్‌తో పాటు ఆసియా కప్ లో ఈసారి నేపాల్ జట్టు కూడా మొదటిసారిగా ఆడుతుండడం విశేషం. మొత్తంగా 13 మ్యాచుల ఈ టోర్నీని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ధ్రువీకరించింది. నాలుగు మ్యాచులు పాకిస్థాన్‌లో, మిగిలిన మ్యాచులన్నీ శ్రీలంక వేదికగా నిర్వహించనున్నారు. ఇందులో ఆరు జట్లు రెండు గ్రూపులుగా విడిపోనున్నాయి. భారత్, పాకిస్థాన్‌, నేపాల్ ఒక గ్రూప్‌ కాగా.. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ మరొక గ్రూప్‌‌గా విభజించారు. టాప్ 4 లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే ఫైనల్ కు చేరుతాయి.