Asia Cup 2023 : ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ఆసియా కప్ సమరం జరగనుంది. మొదట మ్యాచ్ ఆగస్టు 30న పాకిస్థాన్, నేపాల్ మధ్య జరగనుంది. ఇక టీమిండియా మొదటి మ్యాచును పాకిస్థాన్‌తోనే ఆడనుంది. ఈ హైఓల్టోజ్ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు తన రెండో లీగ్ దశలో నేపాల్ తో మ్యాచ్ ఆడనుంది. మొత్తం 13 వన్డేలు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్నాయి.
గ్రూప్ దశ మ్యాచ్‌ల తర్వాత సూపర్-4 మ్యాచులు
ఆసియా కప్ టోర్నీలో భాగంగా శ్రీలంకలో 9, పాకిస్థాన్ లో నాలుగు మ్యాచులను ఆడనుంది. ఈసారి 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ మెగా టోర్నీ జరగనుంది. గ్రూప్ దశ మ్యాచ్‌ల తర్వాత సూపర్-4 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లు సెప్టెంబర్ 6, 9, 10, 12, 14, 15 తేదీల్లో జరుగుతాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, డీడీ స్పోర్ట్స్ లో ఆసియా కప్ మ్యాచులను వీక్షించే అవకాశం ఉంటుంది.