Duleep Trophy 2024: దేశవాళీ టోర్నీ'దులీప్ ట్రోఫీ' రంగం సిద్ధం.. షెడ్యూల్ వివరాలు ఇవే
దులీప్ ట్రోఫీ టెస్ట్ టోర్నీ గురువారం (సెప్టెంబర్ 5) నుంచి ప్రారంభం కానుంది. ఈ నాలుగు జట్ల టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు కూడా పాల్గొనడం విశేషం. టోర్నీలో ఆటగాళ్లను A, B, C, D జట్లుగా విభజించారు. A జట్టుకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తుండగా, B జట్టుకు అభిమన్యు మిథున్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. C జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉండగా, D జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించనున్నాడు. ఈసారి దులీప్ ట్రోఫీ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరగనుంది. అంటే, ఒక్కో జట్టు మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. ఈ టోర్నీలో సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు ఉండవు.
షెడ్యూల్ వివరాలు
సెప్టెంబర్ 5 నుండి 8 వరకు - టీమ్ A vs టీమ్ B - బెంగళూరు సెప్టెంబర్ 5 నుండి 8 వరకు - టీమ్ C vs టీమ్ D - అనంతపురం సెప్టెంబర్ 12 నుండి 15 వరకు - టీమ్ A vs టీమ్ D - అనంతపురం సెప్టెంబర్ 12 నుండి 15 వరకు - టీమ్ B vs టీమ్ C - అనంతపురం సెప్టెంబర్ 19 నుండి 22 వరకు - టీమ్ B vs టీమ్ D - అనంతపురం సెప్టెంబర్ 19 నుండి 22 వరకు - టీమ్ A vs టీమ్ C - అనంతపురం