తదుపరి వార్తా కథనం

IND vs NZ: భారత్-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్.. తొలి టెస్టు మొదటిరోజు ఆట రద్దు..
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 16, 2024
03:52 pm
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్, భారత్‌ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు.
వర్షం కారణంగా ఆట అంతరాయం ఏర్పడడంతో, టాస్ పడకుండానే మొదటి రోజు ఆటను రద్దు చేసేందుకు అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఘటనతో మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
మొదటి రోజు ఆట రద్దు కావడంతో, రెండో రోజు ఆట సమయాల్లో మార్పులు జరిగాయి.
రెండో రోజు ఉదయం సెషన్ 15 నిమిషాల ముందుగా ప్రారంభమవుతుంది. ఉదయం సెషన్ 9.15 గంటల నుండి 11.30 గంటల వరకు సాగనుంది.
మధ్యాహ్నం సెషన్ 12.10 నుండి 2.25 గంటల వరకు జరగనుంది. చివరి సెషన్ 2.45 నుండి 4.45 గంటల వరకు కొనసాగుతుంది.
మీరు పూర్తి చేశారు