
PBKS vs KKR: బ్యాటర్ల తప్పిదమే ప్రధాన కారణం.. ఓటమిపై స్పందించిన అజింక్యా రహానే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) పంజాబ్ కింగ్స్‌తో తలపడింది.
112 పరుగుల సాధారణ లక్ష్యాన్ని చేధించలేక 16 పరుగుల తేడాతో ఓటమి చెందడంపై కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే స్పందించాడు.
ఈ ఓటమికి తానే బాధ్యత వహిస్తానని, జట్టు బ్యాటింగ్ విఫలమవడమే పరాజయానికి కారణమని పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ, "ఈ మ్యాచ్ గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. మైదానంలో ఏం జరిగిందో మనం అందరం చూశాం.
మా ప్రయత్నం పట్ల కొంచెం నిరాశగా ఉంది. కేకేఆర్ ఓటమికి బాధ్యత తీసుకుంటా. తాను తప్పు షాట్ ఆడి ఎల్బీగా ఔటయ్యాను. అంగ్‌క్రిష్ స్పష్టంగా కనిపించలేదు.
Details
మిగిలిన మ్యాచుల్లో సరైన ప్రణాళికతో ముందుకెళ్తాం
అంపైర్ కాల్ ఉండొచ్చని అనిపించింది. ఆ సమయంలో అవకాశం తీసుకోవాలనుకోలేదు. జట్టుగా బ్యాటింగ్‌లో మేము పూర్తిగా విఫలమయ్యాం. ఓటమికి పూర్తి బాధ్యత బ్యాటర్లదేనని వెల్లడించాడు.
బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పంజాబ్ వంటి శక్తివంతమైన జట్టును కేవలం 111 పరుగులకే కట్టడి చేయగలిగారు. ఇలాంటి పిచ్‌లపై పుల్ ఫేస్ బంతులను తట్టుకోవచ్చు, కానీ స్పిన్ బౌలింగ్‌కు ఎదురొద్దం కష్టమయ్యింది. అయినా ఈ లక్ష్యాన్ని మేము సులభంగా చేధించాల్సింది.
కానీ చేదించలేకపోయమని విశ్లేషించాడు. ఇంకా టోర్నమెంట్‌లో సగం మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయని, వాటిలో ఉత్తమ ప్రదర్శన ఇస్తామని రహానే తెలిపాడు.
ఈ ఓటమితో కుంగిపోమని, మిగిలిన మ్యాచ్‌ల్లో సరైన ప్రణాళికతో, సానుకూల దృక్పథంతో బరిలోకి దిగుతామని రహానే స్పష్టం చేశారు.