
Team India 183: భారత క్రికెట్‌లో 183 నంబర్‌కు ప్రత్యేక స్థానం.. అదేంటంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
183 అనే సంఖ్యతో టీమిండియా (Team India)కు మంచి అనుబంధం ఉంది! క్రికెట్ చరిత్రలో 183 సంఖ్య అనేక ముఖ్యమైన సంఘటనలతో అనుబంధం ఏర్పడింది. ఈ సంభావనను పరిశీలిస్తే, భారత క్రికెట్ టీమ్, అలాగే ముగ్గురు మాజీ కెప్టెన్ల మధ్య 183తో ఉన్న అనుబంధం అర్థమవుతుంది. భారత క్రికెట్ టీమ్ 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో మొదటిసారిగా ప్రపంచ కప్ సాధించింది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో,వెస్టిండీస్ జట్టుపై మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ అయింది. (అప్పటికి వన్డే మ్యాచులలో ఒక ఇన్నింగ్స్‌కు 60 ఓవర్లు ఉండేవి). ఆ సమయంలో, చాలా మంది వెస్టిండిస్‌నే ప్రపంచ కప్ చాంపియన్లు అనుకున్నారు.
వివరాలు
క్రికెట్‌లో భారత్ దశను మలుపు తిప్పిన కెప్టెన్‌గా సౌరబ్ గంగూలీ
కానీ అనూహ్యంగా, భారత్ వెస్టిండీస్‌ను 52ఓవర్లలో 140పరుగులకే ఆలౌట్ చేసి 43పరుగుల తేడాతో విజయాన్ని సాధించి,ప్రపంచకప్‌ను గెలుచుకుంది. సౌరబ్ గంగూలీ కి క్రికెట్‌లో భారత్ దశను మలుపు తిప్పిన కెప్టెన్‌గా గుర్తింపు ఉంది. అతనిది వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 183,1999 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై సాధించాడు.కేవలం 158 బంతుల్లోనే ఈ స్కోర్ సాధించాడు. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ వన్డేల్లో 183 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోరు సాధించాడు.ఈసారి కూడా ప్రత్యర్థి శ్రీలంకే. 2005లో ధోనీ ఈ ఘనతను సాధించాడు. 145 బంతుల్లో 15 ఫోర్లు,10 సిక్సుల సాయంతో ఈ పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి వన్డేల్లో 183 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోరు.
వివరాలు
పాకిస్థాన్ పై కోహ్లీ 183 పరుగులు
కోహ్లీ 2012లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఈ ఘనతను సాధించాడు, ఇందులో 22 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే,183 పరుగులతో తమ వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరు కలిగి ఉన్న ఈ ముగ్గురూ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. అయితే వీరిలో ఎవరూ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఈ రికార్డు సాధించలేదు.మహమ్మద్ అజారుద్దీన్ సారథ్యంలో గంగూలీ ఈ ఫీట్ సాధించగా,రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ధోనీ ఈ సెంచరీ బాదాడు. ధోనీ కెప్టెన్సీలో కోహ్లీ ఈ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు.అలాగే,ఈ మూడు సందర్భాల్లోనూ టీమిండియా విజయం సాధించింది. ధోనీ,గంగూలీ ఈ స్కోరు సాధించే క్రమంలో 210 నిమిషాల పాటు క్రీజులో ఉన్నారు,కోహ్లీ 211 నిమిషాల పాటు క్రీజులో నిలిచాడు.