ICC: వన్డే వరల్డ్ కప్ 'ఫైనల్' పిచ్‌కు యావరేట్ రేటింగ్.. బీసీసీఐకి మరో సమస్య!
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో భారత్ ను ఓడించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో వరుసగా పది మ్యాచులు గెలిచిన టీమిండియా(Team India).. చివరి మ్యాచులో చేతులేత్తేసింది. అయితే ఐసీసీ(ICC) తాజాగా ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచులు జరిగిన పిచ్ లకు రేటింగ్ ఇచ్చింది. ఇక నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ పిచ్ కు యావరేజ్ రేటింగ్ పాయింట్లు ఇవ్వడం గమనార్హం. పిచ్ మందకొడిగా ఉందని, అయితే అవుట్ ఫీల్డ్ మాత్రం చాలా బాగుందని ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాప్ట్ వెల్లడించారు.
ఈడెన్ గార్డెన్స్ పిచ్ 'వెరీ గుడ్' రేటింగ్
ఇక భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య వాంఖడే వేదికగా తొలి సెమీస్ జరిగిన విషయం తెలిసిందే. కొత్త పిచ్‌కు బదులు వాడిన పిచ్‌పై మ్యాచును నిర్వహించారంటూ బీసీసీఐ ఆరోపణలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఈ పిచ్ కు ఐసీసీ బాగుంది అని రేటింగ్ ఇచ్చింది. మరోవైపు ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్ మ్యాచ్ కోలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగింది. మొదట ఈ పిచ్ పై దక్షిణాఫ్రికా 212 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా లక్ష్య చేధనకు 47.2 ఓవర్లను తీసుకోవాల్సి వచ్చింది. ఈ పిచ్ మైదానం అవుట్ ఫీల్డ్ కు 'వెరీ గుడ్' రేటింగ్ ఇచ్చారు.