ఆసియా గడ్డపై ఇమామ్-ఉల్-హక్ సాధించిన రికార్డులివే!
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే ఫార్మాట్లో పాకిస్థాన్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ అద్భుతమైన ప్రదర్శనతో అకట్టుకుంటున్నాడు. ఇటీవల ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో పాక్ తరుఫున కీలక ఇన్నింగ్స్ ఆడి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆ మ్యాచులో ఓపెనర్‌గా బరిలోకి దిగి 104 బంతుల్లో 91 పరుగులు చేసి, త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
ఫఖర్ జమాన్ తో కలిసి తొలి వికెట్ 52 పరుగులు జోడించిన ఇమామ్, తర్వాత కెప్టెన్ బాబర్ అజామ్ తో కలిసి మరో 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇమామ్ ఇప్పటివరకు ఆసియా గడ్డపై 30 వన్డేల్లో 56.42 సగటుతో 1,467 పరుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలను బాదాడు.
Details
ఇమామ్-ఉల్-హక్ పై భారీ అంచనాలు
శ్రీలంకపై అక్టోబర్ 2017లో వన్డేలో అరంగ్రేటం చేసిన ఇమామ్ ఆ మ్యాచులో సెంచరీ చేసి సత్తా చాటాడు.
ఇమామ్ 61 వన్డేల్లో 52.20 సగటుతో 2,871 పరుగులకు చేరుకున్నాడు. ఇందులో 18 హఫ్ సెంచరీలు, తొమ్మిది సెంచరీలను బాదాడు. అత్యధికంగా వన్డేల్లో 151 పరుగులు చేశాడు.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌లలో 268 పరుగులు చేయగా, ఇందులో మూడు అర్ధ సెంచరీలున్నాయి.
ఇక త్వరలో జరగనున్న ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఈ బ్యాటర్ పై పాకిస్థాన్ జట్టు భారీ అంచనాలను పెట్టుకుంది.