
DC vs SRH: స్టార్ బ్యాటర్ వచ్చేశాడు.. ఢిల్లీని ఎస్ఆర్‌హెచ్ ఆపగలదా?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ఆరంభం కానుంది. గత మ్యాచ్‌లో లక్నోపై విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ జోష్‌లో ఉంది.
అదే ఊపును కొనసాగించాలనే పట్టుదలతో SRHపై గెలవాలని భావిస్తోంది. మరోవైపు సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో గెలిచినా లక్నోతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది.
ఈ నేపథ్యంలో SRH తిరిగి విజయపథంలోకి అడుగుపెట్టాలని పట్టుదలతో ఉంది.
Details
SRH బ్యాటింగ్, బౌలింగ్ పరిస్థితి
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో SRH ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోవడం పెద్ద దెబ్బైంది. లక్నో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో SRH ధాటికి కళ్లెం వేసింది.
ఈ మ్యాచ్‌లో SRH బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారో ఆసక్తిగా మారింది. మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌ల బౌలింగ్ ఎస్ఆర్‌హెచ్ కఠిన పరీక్షగా మారనుంది.
స్టార్క్ ఆరంభంలో విజృంభిస్తే SRH పికప్ చేసుకోవడం కష్టమే. అయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్‌లు ఫామ్‌లో ఆడితే ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.
ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ పటిష్టంగా లేకపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
Details
రాహుల్ రాకతో ఢిల్లీ బ్యాటింగ్ పటిష్టం
కమిన్స్, షమీ, జంపా, హర్షల్ పటేల్‌లు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం లేదు. ఈసారి వారి ప్రదర్శన కీలకం కానుంది.
కుమార్తె జన్మంతో తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి ఢిల్లీ జట్టులో చేరాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అదరగొట్టిన రాహుల్, ఇప్పుడు ఐపీఎల్‌లో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతని రాకతో ఢిల్లీ బ్యాటింగ్ మరింత పటిష్టమైంది.
అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.
మెక్‌గుర్క్, డుప్లెసిస్, ట్రిస్టన్ స్టబ్స్, పోరెల్, రిజ్విలు ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.
అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎస్ఆర్‌హెచ్ అడ్డుకుంటుందో లేదో చూడాలి.