Suryakumar Yadav: క్లిష్ట సమయంలో యువ ఆటగాళ్లు చూపించిన ప్రతిభ అద్భుతం : సూర్యకుమార్ యాదవ్
ఈ వార్తాకథనం ఏంటి
చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో భారత్ రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది. తిలక్ వర్మ (72*) చివరి వరకు క్రీజ్‌లో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
అయితే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) మరోసారి నిరాశపర్చగా, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ (2) కూడా కీలక సమయంలో పెవిలియన్ చేరాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 165 పరుగులు చేయగా, భారత్ 19.2 ఓవర్లలో 166 పరుగులు చేసి విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు, కుర్రాళ్లు తనపై ఒత్తిడి తగ్గించారని పేర్కొన్నాడు.
Details
తిలక్ వర్మ అద్భుతంగా ఆడారు
ఇంగ్లండ్ 160+ పరుగుల లక్ష్యం ఈజీగా ఛేదించగలమని అనుకున్నామని, కానీ వారి బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారన్నారు.
గత మ్యాచ్‌లో మనం దూకుడుగా ఆడినా, రెండో టీ20లో అలా కుదర్లేదన్నారు. అయినా ఎప్పుడూ దూకుడుగా ఆడాలనే నిర్ణయం తాము తీసుకున్నామని, అయితే పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే కీలకమన్నారు.
తమ కుర్రాళ్లు అదే పని చేసి, తన మీద ఒత్తిడిని తగ్గించారని సూర్యకుమార్ యాదవ్ చెప్పారు.
అక్షర్ పటేల్ ఔటైన తర్వాత ఏమవుతుందోనని కాస్త కంగారు పడ్డాడని, కానీ తిలక్ అద్భుతంగా ఆడాడని కొనియాడారు.
అతడితో పాటు బిష్ణోయ్, అర్ష్‌దీప్ విలువైన పరుగులు చేశారన్నారు. సమిష్టి కృషి చేస్తే తప్పకుండా ఫలితాలొస్తాయని సూర్యకుమార్ వ్యాఖ్యానించాడు.