Page Loader
AUS Vs WI: 100 టెస్టులు ఆడినా లాభం లేదు.. వెస్టిండీస్ జట్టు నుంచి బ్రాత్‌వైట్ ఔట్!
100 టెస్టులు ఆడినా లాభం లేదు.. వెస్టిండీస్ జట్టు నుంచి బ్రాత్‌వైట్ ఔట్!

AUS Vs WI: 100 టెస్టులు ఆడినా లాభం లేదు.. వెస్టిండీస్ జట్టు నుంచి బ్రాత్‌వైట్ ఔట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 14, 2025
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు తన అనుభవజ్ఞుడైన ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌పై వేటు వేసింది. వరుసగా 90 టెస్ట్ మ్యాచ్‌లకు నిలకడగా ప్రాతినిధ్యం వహించిన బ్రాత్‌వైట్, ఈ మ్యాచ్‌కు చోటు దక్కించుకోలేకపోయాడు. ఇది వెస్టిండీస్ జట్టు చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఎందుకంటే ఇప్పటి వరకు వరుసగా 90 టెస్టుల్లో ఆడిన ఏకైక వెస్టిండీస్ ఆటగాడిగా బ్రాత్‌వైట్ గుర్తింపు పొందాడు. అయితే మొదటి రెండు టెస్టులలో అతడి పేలవమైన ఫార్మ్‌పై వేటు పడినట్టు కనిపిస్తోంది.

Details

ఫేలవ ఫామ్ లో బ్రాత్ వైట్

బ్రాత్‌వైట్ ఆ రెండు టెస్టుల్లో చేసిన స్కోర్లు గమనిస్తే - 4, 4, 0, 7 పరుగులే. ఈ తారతమ్య ప్రదర్శన నేపథ్యంలో మూడో టెస్టు నుంచి అతడిని తప్పించినట్టు తెలుస్తోంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ ఇప్పటివరకు వెస్టిండీస్ తరఫున మొత్తం 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతడు 32.51 సగటుతో 5,950 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 212. టెస్ట్ చరిత్రలో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వెస్టిండీస్ ఆటగాళ్లలో బ్రాత్‌వైట్ అగ్రస్థానంలో ఉన్నాడు.

Details

వెస్టిండీస్ తరపున వరుసగా టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితా

క్రెయిగ్ బ్రాత్‌వైట్ - 90 టెస్టులు గ్యారీ సోబర్స్ - 85 టెస్టులు డెస్మండ్ హేన్స్ - 72 టెస్టులు బ్రియాన్ లారా - 64 టెస్టులు ఇక సిరీస్ విషయానికి వస్తే - ఆస్ట్రేలియా ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది. మొదటి టెస్టు 159 పరుగుల తేడాతో, రెండవ టెస్టు 133 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడో మ్యాచ్ మిగతా పరువు దక్కించుకునేందుకు వెస్టిండీస్ ఆటగాళ్లకు పరీక్షగా మారనుంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను పక్కన పెట్టిన నిర్ణయం ఆశ్చర్యంగా మారినప్పటికీ, ఆయన ఇటీవల ఫార్మ్ దృష్ట్యా ఇది తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.