Page Loader
Venkatesh Prasad: టాప్ 5 ఆటగాళ్లలో కోహ్లీ, రోహిత్, ధోనీలకు చోటు లేదు
టాప్ 5 ఆటగాళ్లలో కోహ్లీ, రోహిత్, ధోనీలకు చోటు లేదు

Venkatesh Prasad: టాప్ 5 ఆటగాళ్లలో కోహ్లీ, రోహిత్, ధోనీలకు చోటు లేదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2025
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ సెలెక్టర్, క్రికెట్ కోచ్ వెంకటేష్ ప్రసాద్ ఆదివారం తన టాప్-5 భారతీయ క్రికెటర్ల జాబితాను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లను చేర్చలేదు. తొలి నాలుగు స్థానాల్లో భారత క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లైన సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే ఉన్నారు. వారు భారత క్రికెట్‌లో అద్భుతమైన ఘనతలు సాధించిన ఆటగాళ్లు. ఐదోవ స్థానంలో రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, గుండప్ప విశ్వనాథ్ వంటి ఆటగాళ్ల పేర్లను ప్రసాద్ సంయుక్తంగా ప్రకటించారు. ప్రస్తుత ఆటగాళ్ల గురించి ఓ అభిమాని అడిగినప్పుడు విరాట్ కోహ్లీ, బుమ్రా పేర్లను ఆయన పేర్కొన్నారు.

Details

భారత్ తరుపున 161 వన్డేలాడిన ప్రసాద్

మరో అభిమాని అతని ఫేవరెట్ ప్లేయర్ల గురించి అడిగితే, ప్రసాద్ తన అభిమాన ఆటగాళ్లను వివిధ ఫార్మాట్లలో గుర్తించారు. టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్, వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లీ, టీ20లో హెన్రిచ్ క్లాసెన్‌ తమ ఫేవరెట్ ఆటగాళ్లుగా ఎంపిక చేసుకున్నారు. వెంకటేష్ ప్రసాద్ భారత జట్టులో ఆడిన తర్వాత సెలెక్టర్, కోచ్‌గా కూడా పనిచేశారు. ఆయన 33 టెస్టులు, 161 వన్డే మ్యాచ్‌లు ఆడారు. 123 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఈ విధంగా భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ప్రసాద్ ఏర్పరచుకున్నాడు.