LOADING...
Rohit Sharma: రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి వెనుక ఉన్న అసలైన కారణాలివే!
రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి వెనుక ఉన్న అసలైన కారణాలివే!

Rohit Sharma: రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి వెనుక ఉన్న అసలైన కారణాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2025
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ వన్డే జట్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు. టెస్టు కెప్టెన్‌గా ఉన్న యువ ప్రతిభ శుభ్‌మన్ గిల్‌కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించారు. ఈ నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డే సిరీస్‌లో గిల్ కొత్త నాయకత్వ బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే ముగ్గురు కెప్టెన్లు ఉండటం సులభం కాదని చెప్పిన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, దీని వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

Details

జట్టు సంస్కృతికి ప్రాధాన్యం

బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్య కారణం జట్టు సంస్కృతి దెబ్బతినకూడదని భావించడం."రోహిత్ లాంటి సీనియర్ ఆటగాడు కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే కెప్టెన్‌గా ఉంటే, డ్రెస్సింగ్ రూమ్‌లో తన ఫిలాసఫీని అమలు చేయడానికి ప్రయత్నించేవారు. వన్డేలు తక్కువగా ఉన్న ఈ పరిస్థితిలో ఇది జట్టు సంస్కృతిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా ఉంచుకుని జట్టును సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. 38ఏళ్ల రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరూ రెండు సంవత్సరాల్లో అదే స్థాయిలో కొనసాగడం కష్టం. వారి ఫామ్ అకస్మికంగా పడిపోతే నాయకత్వ బృందంలో గందరగోళం రాకుండా ప్రణాళికలుఇప్పటికే రూపొందించబడుతున్నాయి.

 Details

నిరంతర ప్రణాళిక అవసరం

గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి ఆరు నెలల్లో జట్టు విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేదని, కానీ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లలో ఓటమి తర్వాత కఠినంగా వ్యవహరించడం ప్రారంభించినట్లు వర్గాలు తెలిపాయి. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్, కోహ్లీ అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా సెలక్టర్లు ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు రోహిత్, కోహ్లీ ఇద్దరూ గిల్ సారథ్యంలో వన్డేలు ఆడనున్నారు, తద్వారా జట్టు స్థిరత్వం, భవిష్యత్తు విజయాల పట్ల నిరంతర ప్రణాళిక అమలు అవుతుంది.