
ICC Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అడుగుమోపిన జట్లు ఇవే..!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ చివరి అంకానికి చేరింది.
ఈ ప్రపంచ కప్‌లో లీగ్ రౌండ్ ముగిసిపోవడంతో బుధవారం నుంచి సెమీ ఫైనల్ రౌండ్ ప్రారంభం కానుంది.
అయితే వరల్డ్ కప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్-8 జట్లు 2025 పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ఛాంపియన్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఇది వరకే ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ప్రపంచ కప్ గ్రూప్ స్టేజ్ ముగియడంతో ఛాంపియన్ ట్రోఫీలో ఆడబోయే జట్లేవో క్లారిటీ వచ్చేసింది.
వాస్తవానికి 2025లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 8 జట్ల మధ్య జరుగుతోంది.
అయితే వరల్డ్ కప్‌లో టాప్ 8 జట్లను ఓసారి పరిశీలిద్దాం..
Details
ఛాంపియన్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం
2025లో జరగనున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 8 దేశాలు
భారతదేశం
2. దక్షిణ ఆఫ్రికా
3. ఆస్ట్రేలియా
4. న్యూజిలాండ్
5. పాకిస్తాన్
6. ఆఫ్ఘనిస్తాన్
7. ఇంగ్లండ్
8. బంగ్లాదేశ్
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరగనుంది. 2017లో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నవిషయం తెలిసిందే.
ఇక 8 ఏళ్ల తర్వాత ఈ మెగా ఐసీసీ టోర్నీకి 2025లో పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది.