National Sports Day 2024 : ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి సత్తా చాటిన తెలుగు తేజాలు వీళ్లే
భారత ఒలింపిక్స్ తరుఫున షూటింగ్‌లో ఎంతోమంది పతకాలను సాధించి, దేశ ప్రతిష్టతను కపాడారు. భారతదేశంలో తొలిసారిగా 1990లో ఒలింపిక్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించింది. అయితే కరణం మల్లీశ్వరి నుంచి పీవీ సింధు వరకు భారత తరుఫున పతకాలు సాధించిన తెలుగు వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరణం మల్లీశ్వరి.. ఈ పేరును పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. 2000వ సంవత్సరంలో సిడ్నీలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించి రికార్డు సృష్టించింది. అదే విధంగా వెయిల్ లిఫ్టింగ్ విభాగంలో కూడా కాంస్య పతకం సాధించడం విశేషం. ఈమె శ్రీకాకుళానికి చెందిన లిప్టింగ్ క్రీడాకారిణి
తొలి భారతీయ మహిళగా పి.వి.సింధు రికార్డు
2016లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు రజత పతకం సాధించింది. ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన షూటింగ్ క్రీడాకారుడు గగన్ నారంగ్ కూడా ఒలింపిక్స్ లో సత్తా చాటాడు. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుపొందాడు.
2024లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత్
2008 ఒలింపిక్ క్రీడల్లో క్వార్టర్ ఫైనల్ కు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచింది. ఇక 2024 పారిస్ ఒలింపిక్స్ లో మను బాకర్, సరబ్‌జోత్ సింగ్ కాంస్య పతకాలను సాధించారు.