Afghanistan Cricketers: నవీన్ ఉల్ హాక్‌కు బిగ్ షాక్.. ముగ్గురు ఆటగాళ్లకు ఎన్‌వోసీ నిరాకరణ!
ఈ వార్తాకథనం ఏంటి
ఆప్గనిస్తాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది.
ఐపీఎల్‌తో పాటు విదేశీ లీగ్‌లలో ఆడకుండా నిషేధం విధించినట్లు సమాచారం.
ఈ మేరకు ఎన్‌వోసీ జారీ చేసేందుకు ఆప్గనిస్తాన్ క్రికెట్ బోర్డు నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్, ముజీబ్ రెహ్మన్‌కు రెండేళ్ల పాటు ఎన్‌వోసీ ఇవ్వకూడదని అప్గాన్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ ముగ్గురు ప్లేయర్లు ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
జాతీయ జట్టు కంటే లీగ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారనే కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Details
ఐపీఎల్ దూరం కానున్న ఆప్గాన్ ప్లేయర్లు?
ఒకవేళ ఈ ముగ్గరి ఆటగాళ్లకు ఎన్‌వోసీ ఇవ్వకపోతే వచ్చే ఐపీఎల్‌కు ఈ ముగ్గురు ప్లేయర్లు దూరం కానున్నారు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో ముజీబ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్, ఫజల్ హక్‌ను సన్ రైజర్స్, నవీన్ ఉల్ హక్ ను లక్నో రిటైన్ చేసుకుంది.
అయితే తమకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోయినా, కనీసం దేశవాళీ టోర్నీల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈ ముగ్గురు ఆప్గాన్ క్రికెట్ బోర్డుకు విన్నవించినట్లు తెలిసింది.
వచ్చే నెలలో భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌ను అఫ్గానిస్థాన్ ఆడనుంది