
వన్డే ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీళ్లే
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. వన్డే ప్రపంచ కప్ ప్రారంభానికి కొద్ది రోజులే సమయం ఉంది.
వన్డే ప్రపంచ కప్ టోర్నీ భారత్ వేదికగా ఆక్టోబర్ 5న ప్రారంభం కానుంది.
అయితే వన్డే ప్రపంచ కప్ టోర్నీలలో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కపిల్ దేవ్
భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తన పేస్ అటాకింగ్ టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు.
1979, 1983, 1987, 1992 ప్రపంచ కప్‌లలో కపిల్ దేవ్ ఆడాడు. ఇప్పటివరకూ 24 మ్యాచుల్లో 28 వికెట్లను పడగొట్టాడు.
Details
18 మ్యాచుల్లో 31 వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే
ఇక 1983లో భారత్ తరుపున కపిల్ దేవ్ 12 వికెట్లు తీసి, ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
1983లో ఆస్ట్రేలియాపై కపిల్ 5/43 అత్యుత్తమంగా రాణించిన విషయం తెలిసిందే.
అనిల్ కుంబ్లే
టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1996, 1999, 2003, 2007 ప్రపంచ కప్ టోర్నీలో కీలక సమయంలో వికెట్లు తీశాడు.
ఇప్పటివరకూ 18 మ్యాచుల్లో 31 వికెట్లను తీశాడు.
ఇక 1999లో ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో పాకిస్థాన్ పై 3/48 అత్యుత్తమంగా రాణించాడు.
Details
2019లో ఇంగ్లండ్ పై ఐదు వికెట్లు పడగొట్టిన షమీ
మహమ్మద్ షమీ
ప్రపంచకప్‌లలో భారత్ తరఫున పేసర్ మహ్మద్ షమీ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.
2015, 2019 ప్రపంచ కప్ ఈవెంట్లో 11 మ్యాచులు ఆడి 31 వికెట్లను పడగొట్టాడు.
2019లో ఇంగ్లండ్ పై షమీ 5/69 అత్యుత్తమంగా రాణించిన విషయం తెలిసిందే.
జవగల్ శ్రీనాథ్
ప్రపంచ కప్ చరిత్రలో జహీర్ ఖాన్ తో కలిసి శ్రీనాథ్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
1992, 1999, 2003, 2007 ప్రపంచ కప్ లలో శ్రీనాథ్ ఆడాడు. ఇప్పటివరకూ 34 మ్యాచుల్లో 44 వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
2003లో జరిగిన సూపర్ సిక్స్‌ల పోరులో శ్రీలంకపై నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Details
44 వికెట్లతో జహీర్ ఖాన్ అగ్రస్థానం
జహీర్ ఖాన్
టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ తన బౌలింగ్‌తో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు.
2003, 2007, 2011 ప్రపంచ కప్ టోర్నీలో జహీర్ ఖాన్ అద్భుత ప్రదర్శనతో శబాష్ అనిపించుకున్నాడు.
ఇప్పటివరకూ 23 మ్యాచుల్లో 20.22 సగటుతో 44 వికెట్లు పడగొట్టి భారత తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డుకెక్కాడు.
2003లో న్యూజిలాండ్ పై 4/42తో జహీర్ ఖాన్ విజృంభించిన విషయం తెలిసిందే.