IPL 2025 Auction: వేలంలో కోట్లు రాబట్టే యువ క్రికెటర్లు వీరే.. ఈ ఆటగాళ్లు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షిస్తారా?
ప్రతి సీజన్‌లో ఐపీఎల్లో యువ క్రికెటర్లకు సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ వేలం ఈసారి కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దాలో జరగే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా ఉంది. ఈ సారి వేలంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని కొందరు ప్లేయర్లు భారీ ధరకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయి. వారిలో ఐదుగురి ఆటగాళ్లు గురించి తెలుసుకుందాం. అశుతోష్ శర్మ పంజాబ్ కింగ్స్ తరఫున 2024 సీజన్‌లో మెరుపులు మెరిపించిన అశుతోష్ శర్మ పవర్ హిట్టర్, ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు. 167 స్ట్రైక్ రేట్‌తో ఆకట్టుకున్న ఈ యువ ఆటగాడు వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షనున్నాడు.
వైభవ్ అరోరా
కేకేఆర్ తరఫున బౌలింగ్‌లో కీలక పాత్ర పోషించి 2024 సీజన్‌లో జట్టును విజయవంతం చేసిన వైభవ్ అరోరా, పవర్ ప్లేలో తన బౌలింగ్‌తో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. అతనిపై వేలంలో పెద్ద మొత్తంలో బిడ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంగ్‌క్రిష్ రఘువంశీ అండర్ 19 వరల్డ్ కప్‌లో అత్యధిక రన్స్ చేసిన రఘువంశీ, 2024 ఐపీఎల్‌లోనూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా ఉన్న అతను, నెక్ట్స్ యశస్వి జైస్వాల్‌గా భావిస్తున్నారు. ఈ సారి వేలంలో అతను ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
రసిఖ్ సలామ్ దర్
ఓ మంచి అన్‌క్యాప్డ్ పేసర్‌గా రసిఖ్ సలామ్ దర్ పేరుగాంచాడు. ఎమర్జింగ్ ఏషియా కప్‌లో 9 వికెట్లు తీసి విజృంభించాడు. ఒక మూడో పేస్ బౌలర్ కోసం చూస్తున్న ఫ్రాంచైజీలు అతనిపై బిడ్ చేసే అవకాశం ఉంది. అభినవ్ మనోహర్ గుజరాత్ టైటాన్స్ తరఫున ఎక్కువగా అవకాశాలు పొందని అభినవ్ మనోహర్, మహారాజా ట్రోఫీ టీ20 టోర్నీలో 196.5 స్ట్రైక్ రేట్‌తో 507 రన్స్ సాధించాడు. ఐపీఎల్ 2025 వేలంలో అతనిపై ఫ్రాంచైజీల మధ్య పోటీ తప్పనిసరిగా కనిపిస్తోంది.