Page Loader
ENG vs IND : ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. కేఎల్ రాహుల్‌ని ఊరిస్తున్నా రికార్డు ఇదే! 
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. కేఎల్ రాహుల్‌ని ఊరిస్తున్నా రికార్డు ఇదే!

ENG vs IND : ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. కేఎల్ రాహుల్‌ని ఊరిస్తున్నా రికార్డు ఇదే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 10, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో నేటి నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈమ్యాచ్ సందర్భంగా భారత ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఒక అరుదైన మైలురాయి ఆహ్వానిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 9,000పరుగుల మైలురాయికి రాహుల్‌కు ఇక కేవలం 199 పరుగుల దూరమే ఉంది. ఈ రికార్డును లార్డ్స్ వేదికగా సాధించాలని భారత్ అభిమానులు అశిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ అన్ని ఫార్మాట్లలో కలిపి 217 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, 8801 పరుగులు నమోదు చేశాడు. ఇందులో టెస్టుల్లో 60 మ్యాచ్‌లు ఆడి 34.58 సగటుతో 3493 పరుగులు చేశాడు. తొమ్మిది సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 85 మ్యాచ్‌ల్లో 49.08 సగటుతో 3043 పరుగులు చేయగా, ఇందులో ఏడుసార్లు శతకాలు చేశాడు.

Details

అద్భుత ఫామ్ లో కేఎల్ రాహుల్

టీ20ల పరంగా 72 మ్యాచ్‌ల్లో 37.75 సగటుతో 2265 పరుగులు నమోదు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. ఈసిరీస్‌లో కూడా రాహుల్ ఫామ్‌లోనే ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో కలిపి 236 పరుగులు చేశాడు. తొలి టెస్టులో 42, 137 పరుగులు చేసి ఆకట్టుకున్న రాహుల్, రెండో టెస్టులో 2, 55 పరుగులతో నిలబడ్డాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి భారత్‌కు మంచి ఆరంభాలు అందిస్తున్నాడు.ఇక లార్డ్స్ వేదికపై రాహుల్ గతంలో రెండు టెస్టులు ఆడి 152 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది. ఈనేపథ్యంలో మూడో టెస్టులో రాహుల్ భారీ ఇన్నింగ్స్‌తో 9,000 పరుగుల ఘనతను సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.