
IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. యువ పేసర్‌కు అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు సిరీస్‌లో భాగంగా నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో మూడో టెస్టు ప్రారంభంకానుంది.
ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఓటమిని ఎదుర్కొన్న టీమిండియా, చివరి టెస్టులో గెలవడానికి గట్టి పట్టుదలతో ఉంది.
ఈ క్రమంలోనే యువ పేసర్ హర్షిత్ రాణాకు భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రంజీ ట్రోఫీ అస్సాం మ్యాచ్‌లో దిల్లీ తరఫున హర్షిత్ రాణా ఐదు వికెట్లు తీసి, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకం సాధించి జట్టుకు కీలక సహకారం అందించాడు.
అతని ఈ ప్రదర్శనను గమనించిన భారత జట్టు మేనేజ్‌మెంట్, హర్షిత్ రాణాను మూడో టెస్టు జట్టులో చేర్చినట్లు తెలుస్తోంది.
details
ఆకాదీప్ స్థానంలో హర్షిత్ రాణా
న్యూజిలాండ్ బ్యాటర్లపై ఒత్తిడి తేవడానికి ఆకాశ్‌దీప్ స్థానంలో హర్షిత్ రాణా ఈ మ్యాచ్‌లో అవకాశం పొందే అవకాశముంది.
22 ఏళ్ల ఈ పేసర్ తన పదునైన బంతులతో ప్రతిపక్ష బ్యాటర్లకు సవాలు విసరగల సత్తా కలిగి ఉన్నాడు.
హర్షిత్ తన 6.2 అడుగుల ఎత్తు, 140 కిలోమీటర్ల వేగంతో విసిరే బౌన్సర్లతో విశేషం చూపగలడు.
పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తన బౌలింగ్ వేగాన్ని తగ్గించి, వైవిధ్యాన్ని పెంచుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సామర్థ్యం ఉంది.
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 11 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసి ప్రతిభ చూపిన హర్షిత్, ఇప్పటికే జాతీయ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ దృష్టిలో పడ్డాడు.