
ICC World Cup 2023 : ప్రపంచ కప్ సెమీ పైనల్స్ షెడ్యూల్ ఇదే.. వేదికలు ఎక్కడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లీగ్ దశ ముగిసింది. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ చేరుకున్నాయి.
తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈసెమీ ఫైనల్ మ్యాచులు వరుసగా నవంబర్ 15, 16 తేదీల్లో ముంబై, కోల్ కత్తా వేదికల్లో జరగనున్నాయి.
భారత్-న్యూజిలాండ్‌తో, దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది.
ఇక పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో జట్టు, నాలుగో పొజీషన్ లో ఉన్న టీమ్‌తో ఆడటం ఆనవాయితీగా వస్తోంది.
మరోవైపు రెండో స్థానంలో నిలిచిన జట్టు, మూడో స్థానంలో ఉన్న జట్టుతో సెమీఫైనల్ ఆడాల్సి ఉంటుంది.
మొదటి సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్ 15న మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Details
రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఢీ
ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది.
మొదటి సెమీస్‌లో గెలిచిన జట్టు 19వ తేదీన ఫైనల్స్ ఆడనుంది. 16వ తేదీన దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్స్ విజేతతో తలపడుతుంది.
ఈ టోర్నీలో సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ పై విజయం సాధించి పగ తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.