LOADING...
NZ Vs UAE:రెండో సారి 5 వికెట్లను తీసిన సౌథీ 
రెండో సారి 5 వికెట్లను తీసిన సౌథీ

NZ Vs UAE:రెండో సారి 5 వికెట్లను తీసిన సౌథీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2023
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మొదటి T20Iలో న్యూజిలాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ని ఓడించడంలో టిమ్ సౌతీ ముందుండి నడిపించాడు. 156 పరుగులను ఛేదించే సమయంలో ఆతిథ్య జట్టు 136 పరుగులకే వెనుదిరగడంలో అతను ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యువ జట్టుకు నాయకత్వం వహించిన సౌతీ తన మొదటి ప్రయత్నంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. టీమ్ సౌథీ నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. పరుగుల వేటలో మొదటి బంతికే యూఏఈ సారథి ముహమ్మద్ వసీమ్‌ను ట్రాప్ చేశాడు. అనంతరం సౌథీ వృత్తా అరవింద్‌, బాసిల్ హమీద్, అయాన్ అఫ్జల్ ఖాన్,జునైద్ సిద్దిక్‌లను అవుట్ చేశాడు .

Details 

రెండో సారి 5 వికెట్లను తీసిన సౌథీ 

టీ20 క్రికెట్‌లో సౌథీ ఐదు వికెట్లు తియ్యడం ఇది రెండో సారి . 2010లో ఆక్లాండ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని కెరీర్-బెస్ట్ ఫిగర్స్ 5/18. రైట్ ఆర్మ్ సీమర్ ఫార్మాట్‌లో 23.05 సగటుతో 139 వికెట్లు పడగొట్టాడు. UAEతో రెండో T20 మ్యాచ్‌లో, సౌథీ బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ (140)ను అధిగమించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించే అవకాశం ఉంది. స్వదేశ, విదేశలలో టీ20ల్లో ఐదు వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా సౌథీ నిలిచాడు. ఓవరాల్‌గా దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మాత్రమే పొట్టి ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

5 వికెట్లతో రాణించిన సౌథీ