Page Loader
Champions Trophy:ఛాంపియన్స్ ట్రోఫీ కోసం PCB హైబ్రిడ్ మోడల్‌ని అంగీకరించేలా   ICC అద్భుతమైన ఆఫర్
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం PCB హైబ్రిడ్ మోడల్‌ని అంగీకరించేలా ICC అద్భుతమైన ఆఫర్

Champions Trophy:ఛాంపియన్స్ ట్రోఫీ కోసం PCB హైబ్రిడ్ మోడల్‌ని అంగీకరించేలా   ICC అద్భుతమైన ఆఫర్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2024
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి పాకిస్థాన్‌ను ఒప్పించే ప్రయత్నాలు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాఠాలు చేపట్టింది. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) తన ప్రతిపాదనను అంగీకరిస్తే ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, భారత్ ఇప్పటికే ఐసీసీకి పాకిస్థాన్‌కు వెళ్లలేమని తెలిపిన తర్వాత ఈ టోర్నీ షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు.

వివరాలు 

సమస్యను పరిష్కరించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలు..

ఈ రోజు ఐసీసీ బోర్డు సభ్యులు సమావేశమై పాక్‌ను ఒప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ''పాక్ ప్రస్తుతం హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందించాం. భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లు యూఏఈ వేదికగా జరగాలని, భారత జట్టు ఫైనల్స్‌కు వచ్చినప్పుడు ఆ మ్యాచ్‌ను దుబాయ్‌లో నిర్వహించాలని ప్రతిపాదించాం'' అని ఐసీసీ వర్గాలు తెలిపారు. ఈ సమావేశం తరువాత దీనిపై మరిన్ని వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.

వివరాలు 

భారత్-పాక్ మ్యాచ్‌లు,ఫైనల్స్‌ను లాహోర్‌లోనే..

పాక్ మాత్రం ఇప్పటి వరకు ఈ ప్రయత్నాలకు అనుకూలంగా స్పందించలేదు. పాక్ ప్రభుత్వం అంగీకరించినా, గ్రూప్ దశలో భారత్-పాక్ మ్యాచ్‌లు, అలాగే ఫైనల్స్‌ను లాహోర్‌లోనే నిర్వహించాలని పట్టుబడింది. మరోవైపు, భారత్ మాత్రం సెమీస్, ఫైనల్స్ సహా తాము ఆడే అన్ని మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా నిర్వహించాలని కోరుకుంటోంది. ఈ విషయం మీద పీసీబీ చైర్మన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.