LOADING...
IND Vs AUS మ్యాచుకు కరెంట్ కష్టాలు.. రూ. 3 కోట్ల బకాయిలు
IND Vs AUS మ్యాచుకు కరెంట్ కష్టాలు.. రూ. 3 కోట్ల బకాయిలు

IND Vs AUS మ్యాచుకు కరెంట్ కష్టాలు.. రూ. 3 కోట్ల బకాయిలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2023
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్ గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో మరికాసేపట్లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచుకు విద్యుత్ కష్టాలు తప్పట్లేదు. ప్రస్తుతం రాయ్‌పూర్ స్టేడియంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. 2009 నుంచి కరెంట్ బిల్లు కట్టకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. రూ.3.16 కోట్లు కరెంట్ బిల్లు చెల్లించలేదు. ఐదేళ్ల కిందటే కరెంట్ కనెక్షన్‌ను విద్యుత్ అధికారులు కట్ చేశారు. ఇప్పుడు గ్యాలరీలకు మాత్రమే కరెంట్ అందేలా తాత్కలికంగా కనెక్షన్ పెట్టారు.

Details

ప్లడ్ లైట్స్ కోసం జనరేటర్లు వాడుతున్న సిబ్బంది

ఇక ప్లడ్ లైట్స్ కోసం జనరేటర్లు వాడుతున్నారు. స్టేడియం నిర్మాణం తర్వాత దాని నిర్వహణ పిడబ్ల్యుడికి అప్పగించారు. మిగిలన ఖర్చులను క్రీడా శాఖ భరించాలి. కరెంట్ బిల్లు చెల్లించకపోవడంతో రెండు శాఖలు పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. 2018లో కరెంట్ కనెక్షన్‌ నిలిపివేసినప్పటి నుండి స్టేడియంలో మూడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగడం విశేషం. ఇదిలా ఉండగా, శుక్రవారం జరిగే నాలుగో టీ20లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ ఐదు మ్యాచుల సిరీస్‌లో ప్రస్తుతం ఇండియా 2-1 ఆధిక్యంలో ఉంది.