Aryna Sabalenka: వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ ఆర్యనా సబలెంకాకు షాక్
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల టెన్నిస్ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ ఆర్యనా సబలెంకా (Aryna Sabalenka)కు టొరంటో మాస్టర్స్‌లో ఊహించని షాక్ తగిలింది. నాలుగో రౌండ్‌లోనే ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించింది. సబలెంకాతో పాటు మరో స్టార్ ప్లేయర్ జెస్సికా పెగులా (Jessica Pegula) కూడా టోర్నీకి వీడ్కోలు పలికింది. మరికొద్ది రోజుల్లో యూఎస్ ఓపెన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సబలెంకా ఓటమి చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
క్వార్టర్ ఫైనల్స్‌లో ఎకటెరినా అలెక్జాండ్రోవా..
రష్యాకు చెందిన 16వ సీడ్ ఎకటెరినా అలెక్జాండ్రోవా.. సబలెంకాపై అద్భుత విజయం సాధించింది.
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 7-6 (7/3), 4-6, 6-4 తేడాతో సబలెంకాను ఓడించింది.
దీంతో టొరంటో మాస్టర్స్‌లో సబలెంకా ప్రయాణం నాలుగో రౌండ్‌తోనే ముగిసింది.
క్వార్టర్ ఫైనల్స్‌లో ఎకటెరినా అలెక్జాండ్రోవా.. ఉక్రెయిన్‌కు చెందిన ఎలినా స్విటోలినాతో తలపడనుంది.
వివరాలు
పెగులాకు కూడా తప్పని ఓటమి..
వరల్డ్ నంబర్ 3 ప్లేయర్ జెస్సికా పెగులాకు కూడా టొరంటో మాస్టర్స్‌లో నిరాశ ఎదురైంది.
రష్యాకు చెందిన 15వ సీడ్ డయానా ష్నైడర్ చేతిలో పెగులా ఓటమి పాలైంది.
కేవలం 73 నిమిషాల్లోనే 23 ఏళ్ల ష్నైడర్.. పెగులాను వరుస సెట్లలో ఓడించడం విశేషం.
6-2, 6-4 తేడాతో ష్నైడర్ విజయం సాధించింది. దీంతో పెగులా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
క్వార్టర్ ఫైనల్స్‌లో ష్నైడర్.. టాప్ ప్లేయర్ ఇగా స్వియాటెక్‌తో తలపడనుంది.