వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్స్ షిప్స్‌కు 25, 26న ట్రయిల్స్.. ఈసారీ ఎవ్వరికి మినహాయింపు లేదు
వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్స్‌లో పాల్గొనే ఇండియా రెజ్లర్లను ఎంపిక చేయడానికి ఈ నెల 25, 26న పాటియాలలో ట్రయల్స్ ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సోమవారం అడహక్ ప్యానెల్ స్పష్టం చేసింది. దీంతో ఈ మెగా టోర్నీ సెలెక్షన్ ప్రాసెస్‌పై ఎనిమిది వారాల సస్పెన్స్‌కు తెరదించింది. పాటియాలో నిర్వహించే ఈ ట్రయల్స్ నుంచి ఎవరికి మినహాయింపు లేదని, ప్రపంచ చాంపియన్ షిప్‌లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాలనుకుంటే అందరూ ట్రయల్స్ కు హాజరు కావాలని అదేశాలను జారీ చేసింది. ఆసియా గేమ్స్ లో ట్రయల్స్‌లో జజ్‌రంగ్ పునియా, వినేశ్ పొగాట్‌కు మినహాయింపు ఇవ్వడంపై ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది.
సెప్టెంబర్ 16 నుంచి బెల్ గ్రేడ్ లో ప్రపంచ చాంపియన్ షిప్
సెప్టెంబర్ 16 నుంచి 24 వరకు బెల్‌గ్రేడ్‌లో ప్రపంచ చాంపియన్ షిప్ జరగనుంది. అయితే ఆయా కేటగిరీల్లో టాప్ - 5లో నిలిచిన రెజ్లర్లు పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించనున్నారు. అన్ని వెయిట్ కేటగిరీల్లో ఇంటర్నేషనల్ ఈవెంట్లలో ఇది వరకు మెడల్స్ గెలిచిన వాళ్లు, పోటీ పడ్డ వాళ్లు ట్రయల్స్‌లో పాల్గొనవచ్చని అడ్‌హక్ కమిటీ వెల్లడించింది. ఒక్కో వెయిట్ కేటగిరీలో ఎనిమిది కంటే తక్కువ రెజ్లర్లు వస్తే నార్డిక్ సిస్టమ్‌తో ట్రయల్స్ చేపడుతామని పేర్కొంది. ఇందులో ప్రతి రెజ్లర్ ఇతర పోటీదారులతో ఒక్కోసారి మాత్రమే తలపడనున్నారు. ఇందులో ఎక్కువ విజయాల ఆధారంగా ర్యాంకింగ్ కేటాయిస్తారు. ముఖ్యంగా టాప్-3 రెజ్లర్లకు మాత్రమే మెడల్స్ ఇవ్వనున్నారు.