
Travis Head: ఒకే ఓవర్లో 30 రన్స్.. సామ్ కర్రన్‌ను చితకబాదిన ట్రావిస్ హెడ్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్ జట్టును కంగారూ బ్యాటర్ కష్టాల్లోకి నెట్టాడు.
సిక్సర్ల వర్షం కురిపిస్తూ, ప్రత్యర్థి జట్టును నేరుగా ఒత్తిడిలోకి తీసుకెళ్లాడు. ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో హెడ్ రాణించాడు, ఒకే ఓవర్‌లో 30 పరుగులు సాధించి క్రీజులో చెలరేగాడు.
జోష్, ఇంగ్లిష్ కూడా ప్రధాన పాత్ర పోషించడంతో, ఆసీస్ జట్టు భారీ స్కోరు నమోదు చేయగలిగింది.
ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్‌ను 28 పరుగుల తేడాతో ఓడించారు. అయితే హెడ్ ఇన్నింగ్స్ మ్యాచ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
వివరాలు
మూడు ఫోర్లు, మూడు సిక్సులతో కర్రన్‌కు చుక్కలు
హెడ్ మొదటి బంతినుండే విధ్వంసం సృష్టించాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా వరుసగా భారీ షాట్లు కొట్టాడు.
సామ్ కర్రన్‌ను లక్ష్యంగా చేసుకొని,అతని బౌలింగ్‌లో సిక్సర్లు బాది, కర్రన్ ఓవర్లో ఏకంగా 30 పరుగులు సాధించాడు.
మొత్తంగా ఆ ఓవర్లో మూడు ఫోర్లు, మూడు సిక్సులతో కర్రన్‌కు చుక్కలు చూపించాడు.
23 బంతులు ఎదుర్కొన్న హెడ్ 59 పరుగులు చేశాడు, ఇందులో 8 బౌండరీలు, 4 సిక్సర్లు ఉన్నాయి.
19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ సరసన చేరాడు.
ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆస్ట్రేలియా ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.
వివరాలు
పాంటింగ్ 2005లో న్యూజిలాండ్‌పై ఇదే రికార్డు
పాంటింగ్ 2005లో న్యూజిలాండ్‌పై ఇదే రికార్డు సాధించాడు. తరువాత ఆరోన్ ఫించ్, గ్లెన్ మాక్స్‌వెల్, డాన్ క్రిస్టియన్, మిచ్ మార్ష్ కూడా అదే ఫీట్ సాధించారు.
ఇప్పుడు హెడ్ కూడా అదే ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయింది.
హెడ్, ఇంగ్లిష్, ఓపెనర్ మ్యాట్ షార్ట్ (26 బంతుల్లో 41) రాణించడంతో మంచి స్కోరు సాధించగలిగింది.
అనంతరం ఇంగ్లండ్ జట్టు 28 పరుగుల తేడాతో విజయానికి దూరంగా నిలిచింది, 151 పరుగులకే ఆలౌట్ అయింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్రావిస్ హెడ్ బ్యాటింగ్
Travis Head smashed 30 runs in an over against Sam Curran. 🤯
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2024
- Head, the beast man! pic.twitter.com/KpNVOCySJ0