
Harjas Singh: వన్డేల్లో త్రిశతకం.. 141 బంతుల్లో 314 రన్స్‌తో సరికొత్త రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే (ODI) క్రికెట్‌లో సాధారణంగా 300 బంతుల్లో ఆట జరుగుతుంది. అలాంటి మ్యాచ్‌లో ఒక బ్యాటర్ డబుల్ సెంచరీ సాధించడం అద్భుతం. మరి త్రిశతకం (300+) సాధిస్తే అది నిజంగా మహాద్భుతం. ఇలాంటి అరుదైన రికార్డు అంతర్జాతీయ స్థాయిలో కాదు డొమెస్టిక్ క్రికెట్‌లో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన హర్జాస్ సింగ్ సిడ్నీ గ్రేడ్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించాడు. కేవలం 141 బంతుల్లో 314 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఇందులో 35 సిక్స్‌లు కూడా ఉన్నాయి. వెస్టర్న్ సబర్బ్స్ జట్టుకి చెందిన హర్జాస్ దూకుడుగా ఆడడంతో, టీమ్ మొత్తం 474 పరుగులు చేసింది.
Details
లక్ష్య చేధనలో 287 పరుగులకే పరితమైన సిడ్నీ జట్టు
చివరకు లక్ష్య ఛేదనలో సిడ్నీ 287 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దేశీయ వన్డే క్రికెట్‌లో హర్జాస్‌తో కలిపి ఇప్పుడు ముగ్గురే బ్యాటర్లు త్రిశతకం సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఇలాంటి రికార్డు నమోదు కాలేదు. ఇంతకుముందు న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ ఫస్ట్ గ్రేడ్ క్రికెట్ చరిత్రలో త్రిశతకాలు సాధించిన బ్యాటర్లు వీరే విక్టర్ ట్రంపర్ (1903) 335 పరుగులు, ఫిల్ జాక్వెస్ (2007) 321 పరుగులు. వారిద్దరి తర్వాతే హర్జాస్ సింగ్ తన 308 రన్స్‌తో నిలిచాడు.