Page Loader
TSRTC: క్రికెట్ అభిమానులకు టీఎస్‌ఆర్‌టీ శుభవార్త.. ఉప్పల్ స్టేడియంకి 60 ప్రత్యేక బస్సులు 
TSRTC: క్రికెట్ అభిమానులకు టీఎస్‌ఆర్‌టీ శుభవార్త

TSRTC: క్రికెట్ అభిమానులకు టీఎస్‌ఆర్‌టీ శుభవార్త.. ఉప్పల్ స్టేడియంకి 60 ప్రత్యేక బస్సులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 05, 2024
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ లో ఈ రోజు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులు పోటెత్త‌నున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) వారికీ శుభవార్త చెప్పింది. ఈ రోజు హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియంకు 60 ప్రత్యేక బస్సులను న‌డ‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

సజ్జనార్ 

క్రికెట్ అభిమానులకు సజ్జనార్ విజ్ఞప్తి 

'క్రికెట్ అభిమానులకు శుభవార్త! ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు జరిగే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ్యాచ్ కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియంకు 60 బస్సులు నడపనున్నారు. ఈ బస్సులు సాయంత్రం 6 గంట‌లకు ప్రారంభ‌మై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బ‌య‌లుదేరుతాయి. మ్యాచ్‌ని వీక్షించేందుకు ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించాల్సిందిగా క్రికెట్ అభిమానులను TSRTC అభ్యర్థిస్తోంది" అని టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ VC సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సజ్జనార్ చేసిన ట్వీట్