
IND vs ENG : 4వ టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి 23న రాంచీలో టీమిండియాతో జరగనున్న నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేసింది.
ఇంగ్లండ్ లెగ్-స్పిన్నర్ రెహాన్ అహ్మద్, ఎక్స్‌ప్రెస్ పేసర్ మార్కవుడ్ బదులుగా షోయబ్ బషీర్, ఆలీ రాబిన్సన్‌ను జట్టులోకి తీసుకుంది.
ఆల్‌రౌండర్ డాన్ లారెన్స్‌కు XIలో చోటు దక్కుతుందనే ఊహాగానాలు చెలరేగినప్పటికీ మరోసారి అతను పెవిలియన్ కే పరిమితమయ్యాడు.
అదే సమయంలో ఈ సిరీస్‌లో దారుణంగా విఫలం అవుతున్న విధ్వంసకర ఆటగాడు వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో పై జట్టు మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచింది.
యాషెస్‌లో భుజం గాయంతో తప్పుకున్న తర్వాత ఆలీ రాబిన్సన్‌కు ఇదే తొలి టెస్టు మ్యాచ్. రాబిన్సన్ చివరిసారిగా జూలై 2023లో ఆడాడు.
Details
రాంచీలో గెలిచేందుకు ఇంగ్లాండ్ వ్యూహాం
రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో పరాజయం పాలైన ఇంగ్లండ్ రాంచీలో జరిగే నాలుగో టెస్టులో పుంజుకోవాలని చూస్తోంది.
మరోవైపు 4వ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా లేకుండానే భారత్ ఆడుతోంది. రజత్ పాటిదార్ తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉండగా, భారత్ కూడా ఇద్దరు పేసర్లను రంగంలోకి దించే అవకాశం ఉంది.
ముఖేష్ కుమార్ లేదా ఆకాష్ దీప్ పేస్ పార్టనర్‌గా మహ్మద్ సిరాజ్‌కు భాగస్వామి అవ్వచ్చు.
4వ టెస్టు కోసం ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్:బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇంగ్లండ్ క్రికెట్ చేసిన ట్వీట్
We have named our XI for the fourth Test in Ranchi! 🏏 👇
— England Cricket (@englandcricket) February 22, 2024
🇮🇳 #INDvENG 🏴 #EnglandCricket