Page Loader
ENG vs IND: డ్యూక్స్‌ బంతిపై రెండు జట్లు.. రెండో టెస్టు తర్వాత పెరిగిన విమర్శలు!
డ్యూక్స్‌ బంతిపై రెండు జట్లు.. రెండో టెస్టు తర్వాత పెరిగిన విమర్శలు!

ENG vs IND: డ్యూక్స్‌ బంతిపై రెండు జట్లు.. రెండో టెస్టు తర్వాత పెరిగిన విమర్శలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 10, 2025
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో డ్యూక్స్‌ బంతులు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. తొలి టెస్టులో భారత బౌలర్లు బంతి ఆకారంపై అంపైర్ల వద్దకు తరచూ వెళ్లినట్లే.. రెండో మ్యాచ్‌లో అదే పనిని ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ప్రారంభించారు. 'బంతి త్వరగా షేప్‌ ఔట్ అవుతోంది, మెత్తబడుతోందంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆటగాళ్లు, మ్యాచ్‌ అధికారుల మధ్య కొంత మేరకు చర్చలు కూడా జరిగాయి. మ్యాచ్‌ ఆలస్యం కావడం వల్ల జట్లకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలువురు విశ్లేషకుల అభిప్రాయం.

Details

ఆటగాళ్ల అభిప్రాయాల్లో అసంతృప్తి

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ పిచ్ కంటే ముందే బంతి షేప్‌ అవుట్‌ అవుతుండడం బౌలర్లకు చాలా ఇబ్బంది. మెత్తబడితే పేసర్లకు సహకారం ఉండదు. ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌ కెప్టెన్ బెన్‌ స్టోక్స్ స్పందిస్తూ విదేశాల్లో బంతుల సమస్యలను చూశాం. కానీ ఇప్పుడు డ్యూక్స్‌ బంతులు సైతం అదే మార్గంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పరిష్కారం అవసరమని అన్నాడు. భారత వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ అయితే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు: ఇంత వేగంగా బంతి ఆకారం మారడం నేను ఇంతకుముందు చూడలేదు. ఇది ఆటగాళ్లను అసహనానికి గురిచేస్తోంది. ఇది క్రికెట్‌కు మంచిది కాదని భావిస్తున్నానని తెలిపారు.

Details

బంతిని పరీక్షించే గాజ్ టెస్టు

ఈ రెండు టెస్టుల్లోనూ ఫీల్డ్ అంపైర్లు అనుమానాస్పద సమయంలో 'బాల్ గాజ్' పరికరంతో బంతిని పరీక్షించారు. ఇందులో చిన్న, పెద్ద రెండు రింగ్‌లు ఉంటాయి. ఈ రింగ్‌లలో బంతి సరైనదిగా ఫిట్ అవుతున్నదా అనే పరీక్ష తరువాతే మార్పునకు అంగీకరిస్తారు. అథవా బంతి పూర్తిగా దెబ్బతిన్నట్లైతే దానికి దగ్గరైన మరో పాత బంతిని తీసుకొని మ్యాచ్‌ కొనసాగిస్తారు. కొత్త బంతి మాత్రం 80 ఓవర్ల తర్వాతే ఇచ్చారు.

Details

డ్యూక్స్‌ కంపెనీ స్పందన

ఈ చర్చలపై స్పందించిన డ్యూక్స్‌ బంతుల సంస్థ ప్రతినిధి దిలీప్‌ జగ్‌జోడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంతి రాయి కాదు, ఎప్పుడైనా ఆటకు తగ్గట్లే నిబంధనల్లో మార్పు అవసరం. రెండో కొత్త బంతిని 60-70 ఓవర్ల మధ్యే ఇవ్వడంపై ఆలోచించాలని అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలు బంతిపై వత్తిడి పెరుగుతున్న సమయంలో చర్చనీయాంశంగా మారాయి.

Details

లార్డ్స్‌లో బౌలర్లకు అవకాశం?

ఇప్పటి వరకూ జరిగిన రెండు మ్యాచుల్లో భారీగా పరుగులు వచ్చిన నేపథ్యంలో బౌలర్లకు ఇది కాస్త ఇబ్బందికరమైంది. అయితే మూడో టెస్టు లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న నేపథ్యంలో, అక్కడి వాతావరణం, పేసర్లకు అనుకూల వాలుదల (స్లోప్‌) కారణంగా బంతి తీరుపై ప్రభావం తక్కువగానే ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయినా ఐసీసీ ఈ డ్యూక్స్‌ బంతుల అంశంపై స్పందించాలన్న డిమాండ్‌ మాత్రం తీవ్రంగా వినిపిస్తోంది.