Marathan Runner : ఉగాండా ఒలింపియన్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ప్రియుడు.. చికిత్స పొందుతూ మృతి
ఉగాండా క్రీడాకారిణి రెబెక్కా చెప్టెగీ గురువారం విషాదకరంగా మరణించింది. ఆమె ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించడం వల్ల రెబెక్కా శరీరంపై 75 శాతానికి పైగా కాలిన గాయాలు ఏర్పడ్డాయి. ఈ గాయాల కారణంగా ఆమె కెన్యాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. రెబెక్కా చెప్టెగీ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకుని ఉండగా, ఈ దారుణ ఘటన ఆమె పతకం గెలిచే కలలను చెదరగొట్టింది. ఈ సంఘటన ఉగాండా దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ప్రజలు ఆమె ప్రియుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
క్రీడాకారిణికి,ప్రియుడికి మధ్య వివాదం
రెబెక్కా మరణంపై ఉగాండా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు డొనాల్డ్ రుకారే స్పందిస్తూ, "మన ఒలింపిక్ అథ్లెట్ రెబెక్కా చెప్టెగై ఇక లేరు అనే బాధాకరమైన వార్త మాకు అందింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము," అని అన్నారు. ఈ సంఘటనకు కారణమైన భూవివాదంపై ఇంకా విచారణ జరుగుతుండగా, రెబెక్కా తండ్రి జోసెఫ్ తన కుమార్తెకు న్యాయం కావాలని కోరుతున్నారు. గత సంవత్సరం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 14వ స్థానంలో నిలిచిన చెప్టెగై, 2022లో వరల్డ్ మౌంటైన్, ట్రైల్ రన్నింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుంది.