Page Loader
PCB: పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డ్‌ ఆశ్చర్యకర నిర్ణయం.. సెలక్షన్ కమిటీలోకి మాజీ అంపైర్, వ్యాఖ్యత
పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డ్‌ ఆశ్చర్యకర నిర్ణయం

PCB: పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డ్‌ ఆశ్చర్యకర నిర్ణయం.. సెలక్షన్ కమిటీలోకి మాజీ అంపైర్, వ్యాఖ్యత

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముల్తాన్‌లో పాకిస్థాన్‌ కు ఎదురైన ఓటమితో దేశ క్రికెట్‌లో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. పాకిస్థాన్‌ మాజీ అంపైర్‌ అలీం దార్‌ను సెలక్షన్‌ కమిటీలో చేర్చడం విశేషం. ఈ నిర్ణయం అనేక విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచింది. మాజీ ఆటగాళ్లు ఆఖిబ్‌ జావెద్‌, అజర్‌ అలీ, అలాగే అనలిస్ట్‌ హసన్‌ చీమా కూడా ఈ కమిటీలో చేరారు. ఇప్పటికే అసద్‌ షఫీక్‌ కమిటీలో ఉన్నారు. అయితే మహమూద్‌ యూసఫ్‌ కొన్నాళ్ల క్రితమే ఈ కమిటీ నుంచి రాజీనామా చేశారు. ఈ కొత్త కమిటీలో ప్రతి సభ్యుడికి ఓటింగ్‌ హక్కులుంటాయని పీసీబీ ప్రకటించింది. అయితే హెడ్‌ కోచ్‌ కిరెస్టన్‌, జాసన్‌ గిలిస్పీకి కూడా కమిటీలో స్థానం ఉంటుందా లేదా అనేది ఇంకా వెల్లడించలేదు.

వివరాలు 

147 సంవత్సరాల టెస్టు క్రికెట్‌ చరిత్రలో చెత్త రికార్డు

మరోవైపు, అలీమ్‌ దార్‌ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌, అంపైరింగ్‌ కి రిటైర్మెంట్‌ ప్రకటించారు. తాజాగా ముల్తాన్‌ టెస్టులో పాకిస్థాన్‌కు ఎదురైన ఓటమి, 147 సంవత్సరాల టెస్టు క్రికెట్‌ చరిత్రలో చెత్త రికార్డుగా నిలిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో 500కి పైగా పరుగులు సాధించిన జట్టు 'ఇన్నింగ్స్‌ తేడా'తో ఓడటం ఇది టెస్టు చరిత్రలో తొలిసారి జరిగింది. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాకిస్థాన్‌ 74 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూశింది.