Page Loader
భారత ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్
వన్డేలో సరికొత్త రికార్డును సృష్టించిన ఉమ్రాన్ మాలిక్

భారత ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2023
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేలో ఏ బౌలర్‌కు సాధ్యంకాని రికార్డును ఉమ్రాన్ మాలిక్ క్రియేట్ చేశారు. వన్డేలో అత్యంత వేగవంతమైన భారత్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఏకంగా 156కి.మీ వేగంతో బంతిని విసిరి ఈ ఘనతను సాధించాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బౌలర్ కూడా ఉమ్రాన్.. 2023 జనవరి 3న శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 155 కి.మీ వేగంతో బంతి విసిరి శ్రీలంక కెప్టెన్ దసున్ షనక వికెట్ తీశాడు. ఐపీఎల్‌లో కూడా ఉమ్రాన్ ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ తరఫున ఆడుతున్న ఉమ్రాన్ IPL-2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 157 కి.మీ వేగంతో బంతిని వేశాడు

ఉమ్రాన్ మాలిక్

మూడు కీలక వికెట్లు తీశాడు

ఉమ్రాన్ మాలిక్ ఎనిమిది ఓవర్లలో 57 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన శ్రీలంక 67 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉమ్రాన్‌ మాలిక్‌, నిస్సాంక, అసలంక, వెల్లెగెలే వికెట్లు తీసి టీమిండియా విజయంలో ఉమ్రాన్ మాలిక్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఉమ్రాన్ మాలిక్ ఆరు వన్డేల్లో 10 వికెట్లు పడగొట్టాడు భవిష్యతులో ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేసి.. మరిన్ని రికార్డులు సృష్టిస్తారని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.