పాపం.. రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్‌కు ఊహించని షాక్!
చైన్నై సూపర్ కింగ్స్ ను సొంతమైదానంలో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లో మూడు మ్యాచ్‌లో నెగ్గి పాయింట్ల పట్టికలో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. వరుస విజయాల్లో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ దుమ్ములేపుతోంది. అయితే ఈ మ్యాచ్ సమయంలో కెప్టెన్ సంజు శాంసన్ ఓ చిన్న తప్పు చేశాడు. ఆ తప్పు కారణంగా ఏకంగా అతనిపై ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షలు జరిమానా విధించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు సీఎస్కే కి నిర్ణీత సమయంలో 20 ఓవర్లలను వేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేటు కారణంగా కెప్టెన్ శాంసన్ కు భారీ జరిమానాను విధించారు.
సంజు శాంసన్‌కు రూ.12 లక్షలు జరిమానా
ఐపీఎల్ నిర్వాహకులు మొదటి తప్పుగా భావించి శాంసన్ పై రూ.12 లక్షలు జరిమానా విధించారు. ఇదే తప్పు మళ్లీ రిపీట్ అయితే అతనిపై ఒక్క మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రెండో కెప్టెన్ గా శాంసన్ నిలవడం గమనార్హం. గత సీజన్లో కూడా స్లో ఓవర్ రేటు కారణంగా సంజు శాంసన్ పై రెండు జరిమానా విధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఎన్నో ఆశలతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగిన కెప్టెన్ సంజుశాంసన్ డకౌట్ తో అభిమానులను నిరాశపరిచాడు.