Page Loader
Virat Kohli: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత మైదానంలో నిరాశకు గురైన కోహ్లీ (వీడియో)
వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత మైదానంలో నిరాశకు గురైన కోహ్లీ

Virat Kohli: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత మైదానంలో నిరాశకు గురైన కోహ్లీ (వీడియో)

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 02, 2024
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియాపై ఓడిపోయిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో వరల్డ్ కప్ లో వరుసగా 10 మ్యాచుల్లో విజయం సాధించి, ఫైనల్ మ్యాచులో పరాజయం పాలయ్యారు. ఫైనల్ మ్యాచ్ ఓటమితో టీమిండియా ఆటగాళ్లు తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడగా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ(Virat Kohli)కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ సమయంలో కోహ్లీ తీవ్ర నిరాశగా కనిపించాడు. కోహ్లీ మైదానంలో సహచరుల వైపు నడుస్తూ వికెట్ల వద్దకు రాగానే తన క్యాప్ తో స్టంప్ లను కొట్టడం ఆ వీడియోలో కనిపించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిరాశతో మైదానాన్ని వీడుతున్న కోహ్లీ