LOADING...
UPWW vs GGW : గుజరాత్ జాయింట్స్ చేతిలో యూపీ వారియర్స్ ఓటమి
గుజరాత్ జాయింట్స్ చేతిలో యూపీ వారియర్స్ ఓటమి

UPWW vs GGW : గుజరాత్ జాయింట్స్ చేతిలో యూపీ వారియర్స్ ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2026
06:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్‌ ఐపీఎల్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇవాళ గుజరాత్‌ జాయింట్స్‌ ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. యూపీ వారియర్స్‌పై గుజరాత్‌ జాయింట్స్‌ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ జాయింట్స్‌ నిర్ణీత ఓవర్లలో 207 పరుగులు చేసింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్‌ చివరి వరకు పోరాడినా విజయం దక్కించుకోలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 197 పరుగులకే పరిమితమైంది. యూపీ బ్యాటర్లలో లిచ్‌ ఫీల్డ్‌ 78 పరుగులతో హాఫ్‌ సెంచరీ సాధించినప్పటికీ, ఆ ఇన్నింగ్స్‌ జట్టుకు గెలుపు అందించలేకపోయింది.

Details

రాణించిన గుజరాత్ బౌలర్లు

గుజరాత్‌ బౌలర్లలో రేణుకా, జార్జియా, సోఫీ తలా రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించారు. గార్డ్‌నర్‌, రాజేశ్వరి తలా ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఈ సమిష్టి బౌలింగ్‌ ప్రదర్శనతో గుజరాత్‌ జాయింట్స్‌ మ్యాచ్‌పై పట్టు సాధించి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పది పరుగుల తేడాతో ఓటమి

Advertisement