Team India - WTC: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా.. టీమిండియా ఏ స్థానంలో ఉందంటే..?
న్యూజిలాండ్ తో ఆడిన టెస్టు సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో ఓటమి పాలై డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న టీమిండియా, ఈ సిరీస్‌లో ఎదురైన ఓటమితో ఫైనల్ చేరుకునే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 62.50 శాతం పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది, భారత్ 58.33 శాతంతో రెండో స్థానంలో ఉంది, తరువాత శ్రీలంక 55.56 శాతం, న్యూజిలాండ్ 54.55 శాతం, దక్షిణాఫ్రికా 54.17 శాతం పాయింట్లతో వరుసగా మూడవ, నాలుగవ, ఐదవ స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఆస్ట్రేలియాతో సిరీస్ కీలకం
ఇప్పుడు భారత్‌కు ఆసీస్ పర్యటన అత్యంత కీలకమైనదిగా మారింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కింద భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. WTC సైకిల్‌లో ఇదే చివరి సిరీస్ కావడంతో, కనీసం నాలుగు టెస్టుల్లో విజయం సాధించడమో లేదా ఒకటిని డ్రాగా ముగించడమో అవసరం. ఒక్క మ్యాచ్ ఓడినా.. ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారడం ఖాయం.