
US Open 2025: నెరవేరని యుకీ బాంబ్రీ కల.. సెమీస్‌కే పరిమితం
ఈ వార్తాకథనం ఏంటి
భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీకి యూఎస్ ఓపెన్ 2025లో నిరాశ ఎదురైంది. తన కెరీర్‌లో తొలిసారి 'గ్రాండ్‌స్లామ్' టైటిల్ సాధించాలన్న అతడి కల సెమీఫైనల్లోనే ఆగిపోయింది. పురుషుల డబుల్స్ సెమీస్‌లో యుకీ - మైకెల్ వీనుస్ జంట,జో సలిస్‌బరీ-నీల్ స్కప్‌స్కీ జంట చేతిలో 7-6 (2), 6-7 (5), 4-6 తేడాతో ఓటమిపాలైంది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ పోరులో ప్రతి పాయింట్ కోసం ఆటగాళ్లిద్దరూ అద్భుతంగా పోరాడారు. మొదటి సెట్‌లో యుకీ జంట దూకుడుగా ఆడి విజయాన్ని కైవసం చేసుకుంది. రెండో సెట్‌లోనూ సమానంగా ప్రతిఘటించినా, ఆఖర్లో తడబాటుతో కోల్పోవాల్సి వచ్చింది.. దీంతో పోరు మూడో సెట్ వరకు చేరింది.
వివరాలు
చివర్లో తడబాటు
మూడో సెట్ ను యుకీ - మైకెల్ జంట దూకుడుగా ఆరంభించింది.కానీ మధ్యలో పట్టు కోల్పోయింది. 5-4 తేడాతో ప్రత్యర్థులు ఆధిక్యం సాధించిన సమయంలో బ్రేక్ పాయింట్‌ను గెలుచుకోలేకపోవడంతో యుకీ జోడీ వెనుకబడింది. చివరికి 6-4 తేడాతో మూడో సెట్‌ను కూడా ప్రత్యర్థులు గెలుచుకొని మ్యాచ్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.