LOADING...
వన్డే ప్రపంచకప్ ఫైనల్ క్వాలిఫయర్‌లో యూఎస్‌కు స్థానం
జెర్సీపై విజయం సాధించిన యుఎస్ జట్టు

వన్డే ప్రపంచకప్ ఫైనల్ క్వాలిఫయర్‌లో యూఎస్‌కు స్థానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2023
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది ఇండియాలో వన్డే వరల్డ్‌ కప్‌ 2023 జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భాగం అయ్యేందుకు చిన్న జట్ల మధ్య క్వాలిఫైయర్‌ టోర్నీనిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆ టోర్నీ జరుగుతుంది. వన్డే ప్రపంచ కప్‌ క్వాలిఫయింగ్‌ ప్లే ఆఫ్‌ టోర్నీలో కెనడా, నమీబియా, అమెరికా, యూఏఈ, పీఎన్‌జీ, జెర్సీ దేశాలు పాల్గొన్నాయి. అయితే వన్డే ప్రపంచకప్ ఫైనల్ క్వాలిఫయర్‌లో యూఎస్‌కు స్థానం లభించింది. ఈ ఏడాది భారత్‌తో జరగనున్న వన్డే ప్రపంచ కప్‌కు సంబంధించిన ఫైనల్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో జెర్సీపై యూఎస్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

యుఎస్

207 పరుగులకు జెర్సీని ఆలౌట్ చేసిన యుఎస్

నమీబియాలో జరిగిన ప్లేఆఫ్ ఈవెంట్‌లో యు.ఎస్. జట్టు 231 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన జెర్సీని యూఎస్ 207 పరుగులకే ఆలౌటైంది. దీంతో జూన్-జూలైలో జింబాబ్వే జరిగే ఫైనల్ క్వాలిఫైయర్‌లో యుఎస్ చోటు దక్కించుకుంది. అక్టోబర్-నవంబర్ ప్రపంచ కప్‌లో చివరి రెండు స్థానాల కోసం పోటీపడుతున్న U.S, UAEలు మాజీ ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్, శ్రీలంకతో చేరాయి.