LOADING...
IPL: చిన్న వయసులోనే భారీ అంచనాలు… వైభవ్‌ సూర్యవంశీకి ఇదే గోల్డెన్ ఛాన్స్
చిన్న వయసులోనే భారీ అంచనాలు… వైభవ్‌ సూర్యవంశీకి ఇదే గోల్డెన్ ఛాన్స్

IPL: చిన్న వయసులోనే భారీ అంచనాలు… వైభవ్‌ సూర్యవంశీకి ఇదే గోల్డెన్ ఛాన్స్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 23, 2026
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో ఆడే అవకాశం రావడం పెద్ద విషయం. అలాంటి చిన్న వయసులోనే గత సీజన్‌లో రంగంలోకి దిగిన వైభవ్‌ సూర్యవంశీ తన దూకుడు బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. గత సంవత్సరం మొత్తంలో అండర్‌-19 స్థాయిలో కూడా స్థిరమైన ప్రదర్శన కనబరిచిన ఈ యువ ఆటగాడిపై ఈ ఐపీఎల్‌ ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సారి కూడా అతను తన ప్రతిభను నిరూపిస్తే, టీమ్‌ ఇండియాలో చోటు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది.

వివరాలు

ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

సాధారణంగా ఐపీఎల్‌ అంటే అభిమానుల దృష్టి విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, మహేంద్ర సింగ్‌ ధోని వంటి స్టార్ ఆటగాళ్లపై ఉంటుంది. వారు ఈసారి ఎలా ఆడతారు, వారి జట్లు ఎలా ప్రదర్శిస్తాయి అనే చర్చలు సాగుతాయి. లీగ్‌కు అసలు ఆకర్షణను తెచ్చేది, స్టేడియాలకు ప్రేక్షకులను రప్పించేది ఇలాంటి ప్రముఖ ఆటగాళ్లే. అయితే ఈ సారి ఆ లెజెండరీ క్రికెటర్లతో పాటు యంగ్ క్రికెటర్లపై కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అందులో వైభవ్‌ సూర్యవంశీ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే అతను అభిమానుల దృష్టిని ఆకర్షించడం విశేషం. ఈ సారి అతని ఆటను ప్రత్యక్షంగా చూడటానికి స్టేడియాలకు మాత్రమే కాకుండా టీవీల ముందు కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వివరాలు

13 ఏళ్ల వయసులోనే రూ.1.10 కోట్లు

ఐపీఎల్‌ ప్రారంభం నుంచే రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. అదే ధోరణిలో గత సీజన్‌ వేలంలో వైభవ్‌ సూర్యవంశీని ఎంపిక చేసింది. అప్పటికి అతని వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. ఇంకా స్కూల్‌ చదువు పూర్తికాని ఈ కుర్రాడిపై రాయల్స్‌ రూ.1.10 కోట్లు వెచ్చించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాక, 14 ఏళ్లకే అతడిని ఐపీఎల్‌లో ఆడించడం కూడా పెద్ద సంచలనంగా మారింది. గుజరాత్‌ టైటాన్స్‌ వంటి బలమైన బౌలింగ్‌ జట్టుపై అతను అద్భుతంగా రాణించాడు. తన టైమింగ్‌, శక్తిని చక్కగా ఉపయోగించుకుని సిక్సర్ల వర్షం కురిపిస్తూ కేవలం 35 బంతుల్లోనే శతకం సాధించాడు.

Advertisement

వివరాలు

పరుగుల వర్షం..

మొత్తం ఆ సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు చేసి తన ప్రతిభను నిరూపించాడు. అతని స్ట్రైక్‌ రేట్‌ 206.55 ఉండటం విశేషం. ఐపీఎల్‌ అనంతరం కూడా అతను అండర్‌-19 జట్టులో తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు రోజుల మ్యాచ్‌లో కేవలం 58 బంతుల్లోనే శతకం సాధించాడు. అలాగే ఏసీసీ అండర్‌-19 ఆసియా కప్‌లోనూ స్థిరంగా రాణించాడు. తర్వాత ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో యూఏఈపై 42 బంతుల్లోనే 144 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 32 బంతుల్లోనే శతకం పూర్తి చేయడం విశేషం.

Advertisement