Ravichandran Ashwin: ఛాంపియన్స్ ట్రోఫీ అసలైన హీరో వరుణ్ చక్రవర్తి: అశ్విన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది.
ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ ఆడుతూ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును దక్కించుకున్నాడు.
టోర్నమెంట్ మొత్తానికి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా ఎంపికయ్యాడు.
అయితే, ఈ ఎంపికపై భారత మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
టోర్నమెంట్‌లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అసాధారణ ప్రదర్శన కనబరిచాడని, అతడే 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డుకు అర్హుడని పేర్కొన్నాడు.
తన యూట్యూబ్ ఛానల్ 'యాష్ కి బాత్'లో మాట్లాడుతూ అశ్విన్ వరుణ్ గురించి ప్రస్తావించాడు.
Details
రెండోస్థానంలో వరుణ్ చక్రవర్తి
తన దృష్టిలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వరుణ్ చక్రవర్తినే చేయాల్సి ఉందని, అతడు కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడినా, భారత విజయానికి కీలక భూమిక పోషించారని కొనియాడారు.
గ్లెన్ ఫిలిప్స్‌ను ఔట్ చేసిన తీరు అద్భుతమని, తానైతే ఈ అవార్డును వరుణ్‌కే ఇచ్చేవాడిని అని ప్రశంసించాడు.
ఈ ట్వీట్ వివాదాస్పదమై విమర్శలు ఎదుర్కొన్నా, ఆ వ్యాఖ్యలపై అశ్విన్ వివరణ ఇచ్చాడు. ఫైనల్‌లో వరుణ్ చక్రవర్తి రెండు కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి సహకరించాడు.
మొత్తం టోర్నమెంట్‌లో 9 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో మ్యాట్ హెన్రీ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.