LOADING...
BCCI: బీసీసీఐ నుంచి కీలక అప్‌డేట్‌.. మారిన సౌతాఫ్రికాతో టెస్ట్‌ మ్యాచ్‌ల వేదికలు
బీసీసీఐ నుంచి కీలక అప్‌డేట్‌.. మారిన సౌతాఫ్రికాతో టెస్ట్‌ మ్యాచ్‌ల వేదికలు

BCCI: బీసీసీఐ నుంచి కీలక అప్‌డేట్‌.. మారిన సౌతాఫ్రికాతో టెస్ట్‌ మ్యాచ్‌ల వేదికలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది ముగింపు నాటికి ప్రారంభం కాబోయే టీమిండియా హోం సీజన్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. భారత సీనియర్‌ పురుషుల జట్టు వెస్టిండ్స్‌, దక్షిణాఫ్రికాతో తలపడే టెస్టు మ్యాచ్‌లకు సంబంధించి వేదికల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అదే విధంగా, భారత సీనియర్‌ మహిళల జట్టు ఆస్ట్రేలియాతో ఆడే వన్డే సిరీస్‌ వేదికలు,దక్షిణాఫ్రికా-ఏ జట్టు భారత్‌-ఏ జట్టుతో ఆడే వన్డేలకు సంబంధించి వేదికలు కూడా మారా​యి. మార్పులను బీసీసీఐ జూన్‌ 9న అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్‌ 10 నుండి 14 వరకు జరగాల్సిన రెండో టెస్టు మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగాల్సి ఉండగా,ఇప్పుడు ఆ మ్యాచ్‌ న్యూఢిల్లీకి చెందిన అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగనుంది. వేదిక మారినప్పటికీ,మ్యాచ్‌ తేదీలు యథాతథంగా కొనసాగనున్నాయి.

వివరాలు 

ఢిల్లీలో నవంబర్‌లో తీవ్ర వాయు కాలుష్యం

నవంబర్‌ 14 నుంచి 18 వరకు జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌ ముందుగా అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగాల్సి ఉండగా,ఇప్పుడు అదే మ్యాచ్‌ కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. వేదిక మార్పుకు కారణంగా,ఢిల్లీలో నవంబర్‌లో తీవ్ర వాయు కాలుష్యం ఉండే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. భారత మహిళల జట్టు సెప్టెంబర్‌ 14, 17, 20 తేదీల్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆడాల్సి ఉండగా, ప్రస్తుతం ఆ స్టేడియంలో ఔట్‌ఫీల్డ్‌, పిచ్‌కు మరమ్మతులు జరుగుతున్న కారణంగా మొదటి రెండు వన్డేలను పంజాబ్‌లోని న్యూ ఛండీఘడ్‌లో ఉన్న పీసీఏ స్టేడియానికి మార్చారు.

వివరాలు 

మూడో వన్డే న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో..

ఇక మూడో వన్డేను న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇక సౌతాఫ్రికా-ఏ జట్టు నవంబర్‌ 13, 16, 19 తేదీల్లో భారత్‌-ఏ జట్టుతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వన్డే సిరీస్‌ ఆడాల్సి ఉండగా, ఈ మ్యాచ్‌ల వేదికను రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి మార్చినట్లు బీసీసీఐ తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీసీసీఐ చేసిన ట్వీట్