IND vs NZ: న్యూజిలాండ్‌పై గెలుపు.. సెమీస్‌లో ఆసీస్‌తో తలపడనున్న భారత్
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచులో న్యూజిలాండ్‌పై టీమిండియా 44 పరుగుల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో న్యూజిలాండ్ జట్టు తడబడింది.
వరుసగా వికెట్ల కోల్పోవడంతో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్ (81) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
ఈ గెలుపుతో భారత జట్టు గ్రూప్ బిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక సెమీ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది.
Details
ఐదు వికెట్లతో చెలరేగిన వరుణ్ చక్రవర్తి
భారత జట్టు విజయంలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలక పాత్రలో పోషించారు. ఈ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టి కివీస్ కు కోలుకోలేని దెబ్బ కొట్టారు.
ఇక మిగతా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టి ఫర్వాలేదనిపించారు.
మూడు మ్యాచుల్లోనూ గెలిచి టీమిండియా గ్రూప్ టాపర్ గా నిలిచింది.
సెమీ ఫైనల్స్ లో భారత్ తో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడనున్నాయి.