Asian Champions Trophy: దక్షిణ కొరియాపై విజయం.. ఫైనల్లో చైనాతో తలపడనున్న భారత్
ఆసియా ఛాంపియన్స్ హకీ ట్రోఫీలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ దశలో ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత్, సెమీఫైనల్లో కూడా విజయం సాధించింది. దక్షిణ కొరియాపై 4-1 తేడాతో గెలుపొంది ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఉత్తమ్ సింగ్ (13వ నిమిషం), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (19వ, 45వ నిమిషాలు) జర్మన్‌ప్రీత్ సింగ్ (32వ నిమిషం) గోల్స్ చేయగా, కొరియాకు జిహున్ యంగ్ (33వ నిమిషం) ఏకైక గోల్ అందించాడు. సెప్టెంబర్ 17న ఫైనల్‌లో భారత్ చైనాతో తలపడనుంది. భారత్ నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలవగా, ఈసారి ఐదో సారి విజేతగా అవ్వాలని ఉవ్విళ్లూరుతోంది.