Page Loader
వినేశ్ ఫోగాట్ సంచలన నిర్ణయం.. ఆసియా క్రీడలకు దూరమంటూ ట్వీట్
వినేశ్ ఫోగాట్ సంచలన నిర్ణయం.. ఆసియా క్రీడలకు దూరమంటూ ట్వీట్

వినేశ్ ఫోగాట్ సంచలన నిర్ణయం.. ఆసియా క్రీడలకు దూరమంటూ ట్వీట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2023
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడల్లో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఆసియా క్రీడలకు రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో తాను ఈ పోటీల్లో పాల్లొనడం లేదని వినేశ్ ఫోగాట్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. మోకాలి గాయం కారణంగా వచ్చే నెలలో జరిగే ఆసియా క్రీడల్లో తాను పాల్గొనలేనని మంగళవారం పేర్కొంది. అయితే ఆసియా క్రీడలకు నేరుగా ప్రవేశం పొందిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఆ పోటీల నుంచి వైదొలగడం గమనార్హం. ప్రస్తుతం వినేశ్ ఈ పోటీల నుంచి వైదొలగడంతో ఆమె స్థానంలో అంతిమ్ పంగాల్ ఆసియా క్రీడలకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది.

Details

ఆగస్టు 17న వినేశ్ ఫోగాట్ కు సర్జరీ

రెండు రోజుల క్రితం ట్రైనింగ్ చేస్తుండగా తన ఎడమ మోకాలికి గాయమైందని, వైద్యులు స్కాన్లు, ఇతర పరీక్షలు చేసిన తర్వాత సర్జరీ చేయాలని చెప్పారని, దీంతో ఆగస్టు 17న ముంబయిలో సర్జరీలో చేయించుకుంటున్నానని వినేశ్ ఫోగాట్ తెలిపారు. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో దేశానికి వహించి స్వర్ణం సాధించానని, ఈసారి గాయం కారణంగా దురదృష్టవశాత్తూ ఈ పోటీల్లో పాల్గొనడంం లేదని వెల్లడించింది. అభిమానులు తనపైన చూపించిన ప్రేమను ఇకముందు కూడా కొనసాగించాలని, 2024లో జరగబోయే పారిస్ ఒలింపిక్స్ కు బలంగా తిరిగొస్తానని పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వినేశ్ ఫోగాట్ చేసిన ట్వీట్