Page Loader
IPL 2025: ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘన.. గుజరాత్ కెప్టెన్‌పై చర్యలు
ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘన.. గుజరాత్ కెప్టెన్‌పై చర్యలు

IPL 2025: ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘన.. గుజరాత్ కెప్టెన్‌పై చర్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2025
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 18వ సీజన్‌లో జోరుమీదున్న గుజరాత్ టైటాన్స్‌కు భారీ దెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై రూ.12 లక్షల జరిమానా పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్లో ఓవర్ రేటుకు పాల్పడినందున ఈ జరిమానా విధించారు. ఈ సీజన్‌లో నిర్ణీత సమయానికి ఓవర్ల కోటా పూర్తి చేయకపోవడం గుజరాత్‌కు ఇదే మొదటిసారి కావడంతో మ్యాచ్ రిఫరీ ఈసారి ఫైన్‌తో సరిపెట్టారు. శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే గిల్ సేన నిర్ణీత సమయానికి ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. దీంతో ఐపీఎల్ కోడ్ ఉల్లంఘన కింద గిల్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు.

Details

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో గుజరాత్

ఇదే పొరపాటు రెండోసారి పునరావృతమైతే జరిమానా రూ.24 లక్షలకు పెరుగుతుంది. మూడోసారి జరిగితే రూ.30 లక్షల ఫైన్‌తో పాటు మ్యాచ్ నిషేధం కూడా ఎదురవుతుంది. గుజరాత్ గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ స్కోరు నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ, కెప్టెన్ అక్షర్ పటేల్ (33), అశుతోష్ శర్మ (37) అద్భుత ఇన్నింగ్స్‌లతో 20 ఓవర్లలో 203 పరుగులు చేయగలిగింది. లక్ష్య ఛేదనలో జోస్ బట్లర్ (97) తన విధ్వంసకర ఆటతీరు చూపించాడు. అతడికి షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (42) మద్దతుగా నిలవడంతో గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇక ఐదో విజయాన్ని నమోదు చేసిన గిల్ నేతృత్వంలోని జట్టు పాయింట్ల పట్టికలో టాప్ స్థానం దక్కించుకుంది.