Deepfake Video: శుభ్‌మాన్ గిల్‌ను విమర్శిస్తున్నవిరాట్ కోహ్లి డీప్‌ఫేక్ వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ వీడియోకు బలి అయ్యాడు. అతని డీప్‌ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక స్టార్ క్రికెటర్ డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. దీనికంటే ముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో కూడా వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ వీడియో అతని వాయిస్, ముఖ కవళికలను అనుకరించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుంది. ఈ వీడియోలో కోహ్లి శుభమన్ గిల్ పై తీవ్ర విమర్శలు చేస్తూ తనను తాను లెజెండ్‌గా అభివర్ణిస్తున్నాడు.
కోహ్లీ ఇంతకు ముందు కూడా డీప్‌ఫేక్ వీడియో బాధితుడే ..
విరాట్ కోహ్లీ ఇప్పటికే డీప్‌ఫేక్ వీడియో బాధితుడన్న విషయం తెలిసిందే. అంతకుముందు కోహ్లీ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు చూపించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కోహ్లీ వీడియోను తారుమారు చేశారు. ఇప్పుడు భారత స్టార్ బ్యాట్స్‌మెన్ వీడియోను ట్యాంపరింగ్ చేసి వైరల్ చేయడం ఇది రెండోసారి. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ మధ్య చాలా మంచి అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే. మైదానంలో ఇద్దరూ ఒకరికొకరు సపోర్టివ్ గా ఉంటారు. శ్రీలంక పర్యటన తర్వాత విరామం తీసుకున్న కోహ్లీ బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో కనిపించనున్నాడు. శుభమాన్ గిల్ దులీప్ ట్రోఫీ ఆడుతున్నాడు.