LOADING...
Virat kohli: ఉప్పల్ మ్యాచ్‌లో కోహ్లీ ఆగ్రహం.. హెడ్‌తో వివాదం హాట్ టాపిక్
ఉప్పల్ మ్యాచ్‌లో కోహ్లీ ఆగ్రహం.. హెడ్‌తో వివాదం హాట్ టాపిక్

Virat kohli: ఉప్పల్ మ్యాచ్‌లో కోహ్లీ ఆగ్రహం.. హెడ్‌తో వివాదం హాట్ టాపిక్

వ్రాసిన వారు Moogati Shabari
May 23, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైదానంలో ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే విరాట్ కోహ్లీ.. మ్యాచ్ పూర్తైన తర్వాత సాధారణంగా ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు. అయితే ఈసారి ఆయన వ్యవహారశైలి మాత్రం చర్చకు దారి తీసింది. సన్‌ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్‌తో మ్యాచ్ సందర్భంగా మాటల యుద్ధానికి దిగిన కోహ్లీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోవడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. 11 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 15 పరుగులు మాత్రమే నమోదు చేశాడు.

వివరాలు

కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వాగ్వాదం..

అయితే తక్కువ సమయం క్రీజులో ఉన్నప్పటికీ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన వాగ్వాదం మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ట్రావిస్ హెడ్, కోహ్లీని రెచ్చగొట్టేలా "భారీ షాట్లు ఆడు" అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీనికి కోహ్లీ కూడా ఘాటుగానే స్పందించాడు. "నువ్వు ఆఫ్ స్పిన్ వేయడానికి వస్తే నేను కూడా అలాగే ఆడతా. అయినా నువ్వు ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వస్తుంటావు కదా" అంటూ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ మ్యాచ్‌లో హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాకుండా సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగడం విశేషం. మ్యాచ్ చివర్లో అతడు ఒక ఓవర్ బౌలింగ్ చేసి రజత్ పాటీదార్ వికెట్ కూడా తీశాడు.

వివరాలు

ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేసిన హెడ్..

మ్యాచ్ అనంతరం ట్రావిస్ హెడ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికరమైన సందేశాన్ని పంచుకున్నాడు. "ప్రత్యర్థులు ఊహించలేనంతగా మన ప్రదర్శన ఉండాలి" అనే భావం వచ్చేలా అతడు పోస్ట్ చేయడం మరింత చర్చకు కారణమైంది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన సంఘటన మరింత వైరల్ అయింది. ఆట పూర్తయ్యాక ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలో విరాట్ కోహ్లీ.. సన్‌రైజర్స్ ఆటగాళ్లందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు సాగాడు.

Advertisement

వివరాలు

ఆ ఘటనపై స్పందించిన హర్బజన్ సింగ్..

అయితే ట్రావిస్ హెడ్ చేయి చాచినప్పటికీ కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. వెంటనే వెనుక నిలబడ్డ మరో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడికి మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కోహ్లీ స్పందన చూసిన హెడ్ కొన్ని క్షణాలు అక్కడే నిలబడి తర్వాత ముందుకు వెళ్లిపోయాడు. ఈ ఘటనపై కామెంటరీ సమయంలో మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ కూడా స్పందించాడు. "హెడ్ చేయి అందించినప్పటికీ కోహ్లీ స్పందించలేదు. వీరి మధ్య అసలు ఏమి జరిగిందో స్పష్టంగా తెలియదు. అయితే మ్యాచ్ సమయంలో జరిగిన వాగ్వాదమే ఇందుకు కారణమై ఉండొచ్చు. అందుకే కోహ్లీ అతనికి కరచాలనం ఇవ్వలేదేమో" అని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Advertisement