Page Loader
Virat Kohli: బృందావన్‌ను సందర్శించిన విరాట్‌-అనుష్క దంపతులు
బృందావన్‌ను సందర్శించిన విరాట్‌-అనుష్క దంపతులు

Virat Kohli: బృందావన్‌ను సందర్శించిన విరాట్‌-అనుష్క దంపతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2025
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తాను అమితంగా ఇష్టపడే బృందావన్‌ను మరోసారి సందర్శించాడు. ఆయన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామిక, కుమారుడు అకాయ్‌తో కలిసి ప్రేమానంద్‌ మహారాజ్‌ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ, "గతంలో మేము ఇక్కడ వచ్చినప్పుడు నా మనసులో కొన్ని ప్రశ్నలు ఉండేవి. వాటిని అడగాలని అనుకున్నాను. కానీ, ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు. వారు కూడా మిమ్మల్ని ప్రశ్నలే అడుగుతున్నారు.నేను మనసులోనే వారి తో మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఆ మర్నాడు నేను ఏకాంత వ్రతాలాప్‌ను ఓపెన్‌ చేశాను. అందులో కొందరు నా మనసులో ఉన్న ప్రశ్నలను అడిగారు," అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రేమ భక్తి పొందాలని కోరుకుంది.

వివరాలు 

కెరీర్‌లో గడ్డుకాలం

అనుష్క మాట్లాడుతుండగానే కోహ్లీ తన కుమార్తెను చూసి పలకరిస్తున్నాడు. ఆమె అడిగిన ప్రశ్నలకు ప్రేమానంద్‌ మహారాజ్‌ స్పందిస్తూ, "మీరు ఎంతో ధైర్యవంతులు. ఈ ప్రపంచంలో ఇంత గౌరవం పొందిన తర్వాత భక్తి మార్గాన్ని అవలంబించడం చాలా కష్టం. మీరు చూపుతున్న భక్తికి కచ్చితంగా సమాధానం లభిస్తుంది," అని చెప్పారు. 2023 జనవరిలో కూడా విరాట్‌-అనుష్క జంట ప్రేమానంద్‌ మహారాజ్‌ ఆశ్రమాన్ని సందర్శించింది. కెరీర్‌లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కోహ్లీ బృందావన్‌ను సందర్శించడం విశేషం. తాజా సమాచారం ప్రకారం,కోహ్లీ ప్రస్తుతం తన దృష్టిని పూర్తిగా ఇంగ్లాండ్‌ సిరీస్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీపై పెట్టుకున్నాడు. బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో ఐదు టెస్టులు ఆడిన కోహ్లీ కేవలం 190 పరుగులు మాత్రమే చేసినందున, ఈ విషయం అతన్ని విమర్శలకు గురిచేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బృందావన్‌లో విరుష్క దంపతులు